ఓ మర్డర్ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు. ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.అయితే, మద్యం బాటిల్ మూత పోలీసుల పనిని మరింత సులభతరం చేసింది. మందు బాటిల్ మూత ఆధారంగా నిందితులను ఎలా పట్టుకున్నారో తెలిస్తే అంతా షాక్ అవుతారు.విచారణలో భాగంగా మృతుడి భార్య సుబ్బులు..నిందితుడు గురుప్రసాద్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తేల్చారు.
అయితే, వారి ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని భర్త ఆంజనేయులును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న భార్య సుబ్బులు.. తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనుకున్నవిధంగానే ప్రియుడు గురుప్రసాద్ మరో వ్యక్తి షరీఫ్ కలిసి ఆంజనేయులుకు మాయమాటలు చెప్పి పట్టణ శివారులో పొలాల్లో మందు సిట్టింగ్ కోసం తీసుకొచ్చారు.
ముగ్గురు కలిసి మద్యం సేవించగా.. ప్లాన్ ప్రకారం గురుప్రసాద్ తలపై మద్యం సీసా, బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ నేరంలో గురు ప్రసాద్‌తో పాటు షరీఫ్ కూడా పాలుపంచుకున్నాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై నిందితులు పరార్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా అతని తలపై బలమైన గాయాలను గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ..స్థానికంగా లభ్యమైన మద్యం సీసా మూతపై ఉన్న QR కోడ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
QR కోడ్ ద్వారా మద్యం సీసాను నిందితులు ఏ షాప్‌లో కొనుగోలు చేశారో గుర్తించారు.అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు.24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
https://x.com/pulsenewsbreak/status/2095361861000831028?s=20











