తెలంగాణ

BRS : 2 లక్షల ఉద్యోగాల పేరిట మోసం చేశారు : హరీష్ రావు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత అమలు చేస్తున్న విధానాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత అమలు చేస్తున్న విధానాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరాన్ని హరీష్ రావు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేదని అన్నారు. రాష్ట్రంలో వాస్తవానికి 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు, బీఆర్ఎస్ పార్టీ నేతల పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ‘ఖాళీలు లేక కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేక నిరుద్యోగాలను మోసం’ చేస్తుందని విమర్శలు చేశారు.

నాడు అధికారం లేనప్పుడు తమ ప్రభుత్వం ఏర్పాటైతే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు మాయ మాటలు చెప్పారని గుర్తుచేశారు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 16 వేలు మాత్రమే అని గుర్తుచేశారు. నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధించారని గుర్తుచేశారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టంచేశారు.

ఇదిలాఉండగా, రాష్ట్రంలో 7 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలను కూడా తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది.అభ్యర్థులు ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న తరుణంలో సిద్దిపేటలో కేసీఆర్ పేరిట శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

#siddipet#harish rao#politics#brs#police jobs#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి