స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

ఫేక్ ORCల దందా.. దర్యాప్తునకు రేవంత్ సిద్ధమా?

రచన: Swechaanews Chairman••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న భూ ఆక్రమణలు, నకిలీ ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికేట్ (ORC) ల వ్యవహారంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల 'నమస్తే తెలంగాణ', ఈరోజు 'సాక్షి' దినపత్రికల్లో వెలువడిన ఇన్వెస్టిగేషన్ స్టోరీలకు సంబంధించిన అసలు నిజాలను 2023 జనవరిలోనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు చింతకుంట్ల దేవేందర్ రెడ్డి(స్వేచ్ఛ చైర్మన్)  సంచలన విషయాలను బయటపెట్టారు.

  • అప్పుడు నో.. ఇప్పుడు ఓకేనా?

  • కబ్జాదారులకు రాజకీయ అభయం?

  • మూడేళ్ల కిందటే వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ కథనం

  • రేపే స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి 'ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ' విడుదల

 రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న భూ ఆక్రమణలు, నకిలీ ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికేట్ (ORC) ల వ్యవహారంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల 'నమస్తే తెలంగాణ', ఈరోజు 'సాక్షి' దినపత్రికల్లో వెలువడిన ఇన్వెస్టిగేషన్ స్టోరీలకు సంబంధించిన అసలు నిజాలను 2023 జనవరిలోనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు చింతకుంట్ల దేవేందర్ రెడ్డి(స్వేచ్ఛ చైర్మన్)  సంచలన విషయాలను బయటపెట్టారు.

 ప్రధాన మీడియా ఈ ఘోర అక్రమాలను గుర్తించి వార్తలు రాయడానికి దాదాపు మూడేళ్ల 8 నెలల సుదీర్ఘ సమయం పట్టింది. గతంలో ఓ బీఆర్ఎస్ నేత పేరు మీద ఉన్న భూమి, తదనంతరం ఇనాం చేసిన భూమిగా మారడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివాదాస్పద భూమిలోకి దానం, ఠాకూర్, షకీల్ వంటి వ్యక్తులు ఎలా ప్రవేశించారనే దానిపై స్పష్టమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది.

 

గతంలో ఏ ప్రాతిపదికన అనుమతులు తిరస్కరించారో, మరి ఇప్పుడు అదే భూములకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఎలా అనుమతులు మంజూరు చేశారో సమాధానం చెప్పాలి. గతంలో కబ్జాదారులపై తీవ్రమైన ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ భూ అక్రమాలు, ఫేక్ ORC వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించే ధైర్యం, దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా?.

 

రాబోయే ఉప ఎన్నికల ఖర్చుల కోసమే ఈ అక్రమ భూ లావాదేవీల ద్వారా లభించిన సొమ్మును మళ్లిస్తున్నారా? గతంలో రాసిన వరుస కథనాల దాటికి భయపడి పారిపోయిన కబ్జా ముఠాలు, ప్రభుత్వం మారగానే మళ్లీ ఎలా తిష్ట వేశాయో ఆధారాలతో సహా దేవేందర్ రెడ్డి బయటపెట్టనున్నారు. గతంలో కబ్జాలకు పాల్పడిన ముఠా ఇప్పుడు మళ్లీ ఎలా స్థిరపడింది, దీని వెనుక ఉన్న రాజకీయ హస్తాలు ఏమిటనే సంపూర్ణ ఆధారాలతో కూడిన 'ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ'ని రేపు(సోమవారం) విడుదల కానుంది. ఈ రాబోయే కథనం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా భూ ఆక్రమణల భాగోతంలో మరింత వేడి రాజేసే అవకాశం కనిపిస్తోంది.

 

#FakeORCScam#DevenderReddyInvestigation#TelanganaLandScam#RevanthGovt#LandGrabbingHyderabad#TelanganaNews#ExclusiveStory
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి