తెలంగాణ

Food Safety Telangana: కుళ్లిన మాంసం, దరిద్రంగా కిచెన్లు.. జనాల ఆరోగ్యంతో హోటళ్ల చెలగాటం

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Food Safety Telangana: వెన్న పూసినట్లు మాట్లాడే బేరర్లు, డిమ్ లైట్ల మధ్య అందమైన మ్యూజిక్, టేబుల్ నిండా కలర్‌ఫుల్ ప్లేట్లు.. ఇదీ బయటి ప్రపంచానికి కనిపించే స్టార్ హోటళ్ల దర్పం. కానీ మీరు వేలకు వేలు బిల్లు కట్టి లొట్టలేసుకుంటూ తింటున్న ఆ బిర్యానీలు, స్టార్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిస్తే మాత్రం పచ్చి మంచినీళ్లు కూడా గొంతు దిగవు.

Food Safety Telangana: వెన్న పూసినట్లు మాట్లాడే బేరర్లు, డిమ్ లైట్ల మధ్య అందమైన మ్యూజిక్, టేబుల్ నిండా కలర్‌ఫుల్ ప్లేట్లు.. ఇదీ బయటి ప్రపంచానికి కనిపించే స్టార్ హోటళ్ల దర్పం. కానీ మీరు వేలకు వేలు బిల్లు కట్టి లొట్టలేసుకుంటూ తింటున్న ఆ బిర్యానీలు, స్టార్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిస్తే మాత్రం పచ్చి మంచినీళ్లు కూడా గొంతు దిగవు. ఐటీ కారిడార్‌లోని బడా రెస్టారెంట్లు, పబ్‌లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తాజా తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. వంటగదుల్లో కనిపించిన దరిద్రం, ఆహార తయారీ విధానం చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే వాంతి చేసుకోనంత పనైంది.

ఎలుకలు కొరికిన మయోనైజ్.. ఫ్రిజ్‌లలో కంపుకొట్టే మాంసం

ఈ దాడుల్లో వెలుగుచూసిన అంశాలు నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మూతలు కూడా లేని ఫ్రిజ్‌లలో పచ్చి మాంసం, ఉడికించిన పదార్థాలను కలిపి కుక్కేశారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన నాన్‌వెజ్ కంపుకొడుతున్నా.. రంగులు, రసాయనాలు దట్టించి కస్టమర్ల ప్లేట్లలో వడ్డిస్తున్నారు. ఆహార పదార్థాల డబ్బాల్లోకి బొద్దింకలు, బల్లులు దూరుతున్నాయి. ఇన్ ఆర్బిట్ మాల్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఎలుకలు కొరికిన మయోనైజ్ ప్యాకెట్లను సైతం అలాగే వాడేస్తుండటం అధికారులనే నివ్వెరపరిచింది. పిండి బస్తాల్లో పురుగులు, పాచిపట్టిన కూరగాయలు యథేచ్ఛగా వాడేస్తున్నారు. డ్రెయినేజీ మురుగు పొంగి కిచెన్ టైల్స్‌పైకి చేరుతున్నా, ఆ మురుగు వాసన మధ్యే ఆహారాన్ని తయారు చేస్తున్నారు.

సొమ్ము చేసుకోవడమే పని..

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి కోట్ల రూపాయల దందా నడుపుతున్న 11 ప్రముఖ రెస్టారెంట్లు, పబ్‌ల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేసి, వెంటనే మూసివేయాలని బోర్డులు పెట్టించారు.

అమ్ ఆహా తెలుగు కిచెన్ (ఇన్ ఆర్బిట్ మాల్), ఫ్యూజన్ 9 & అమ్నేషియా స్కై బార్ (ఇన్ ఆర్బిట్ మాల్), కోల్స్ పార్క్ రెస్టారెంట్ (హైటెక్ సిటీ), ఆంతెరా కిచెన్ అండ్ బార్ (గచ్చిబౌలి), లక్కీ రెస్టారెంట్ (మాదాపూర్), సాయిరామ్ మెస్ (మాదాపూర్), మొనాస్టరీ బేవరేజెస్ & పబ్ (హైటెక్ సిటీ),

ఉడుపి ఉపహార్ (గచ్చిబౌలి), కంచి కేఫ్ (హైటెక్ సిటీ), శివాని రెస్టారెంట్ అండ్ బార్ (గచ్చిబౌలి), అల్ సబా రెస్టారెంట్ (గచ్చిబౌలి) ఈ రెస్టారెంట్లు, పబ్‌ల లైసెన్సులను అధికారులు బంద్ చేశారు.

బయటి తిండిపై బ్రేకులు వేయాల్సిందేనా?

అందమైన బిల్డింగులు, ఏసీ గదులు చూసి మోసపోతే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని ఈ దాడులు స్పష్టం చేశాయి. తిన్న ఆహారం విషమై ఆసుపత్రుల పాలవుతున్న కేసుల వెనుక అసలు రహస్యం ఈ స్టార్ హోటళ్ల కిచెన్లలో దాగిన దరిద్రమేనని తేలిపోయింది. కస్టమర్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని కుళ్లిన మాంసం, కల్తీ వంటకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి యాజమాన్యాలపై కేవలం మూసివేతలే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగరవాసులు డిమాండ్

#Food Safety Telangana#Telangana Food Safety#Food Safety Raids#Hyderabad Food Safety#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి