NTRIVIKRAM: దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్– యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ మైథలాజికల్ చిత్రం నుంచి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే నందమూరి అభిమానుల్లో, సినీ లవర్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక, తాజా సమాచారం మేరకు ఈ సినిమా 2027, జనవరి నుంచి సెట్స్‌పైకి రాబోతోందట.
త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల సినిమాను ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఐతే, డ్రాగన్ సినిమాలో గాయం అయిన కారణంగా ఎన్టీఆర్ దాదాపు 3 నెలల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. దీంతో, ఆయన గురూజీతో చేయాల్సిన మైథలాజికల్ మూవీ షూటింగ్ డిలే అయింది. ఇటివలే, ఎన్టీఆర్ తిరిగి ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న డ్రాగన్ షూట్‌లో పాల్గొనడానికి డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం. అక్టోబర్ నుంచి నాన్ స్టాప్‌గా డ్రాగన్ సెట్స్‌లో ఉంటాడట.
ఇక, డ్రాగన్ షూట్ దాదాపుగా డిసెంబర్ వరకూ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్..నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొదలయ్యే మైథలాజికల్ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారట.
ఈ లోపు త్రివిక్రమ్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్, స్క్రిప్ట్, విజువల్ డిజైన్ పనులను పూర్తి చేస్తాడట. అలాగే, ఎన్టీఆర్ కూడా ‘డ్రాగన్’ షూటింగ్ పూర్తి చేసి, ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడు. ఈ మూవీలో పౌరాణిక నేపథ్యంతో పాటు భారీ యాక్షన్, విజువల్స్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్స్‌గా నిలవబోతున్నాయి. అంతేకాదు, ఎన్టీఆర్ ఈ మూవీలో దేవుడిగా నటుస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండటం విశేషం. ఇక, ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.







