సినిమా

Balakrishna: రౌడీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న బాలయ్య!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండకి సంబందించిన రౌడీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారా! బాలయ్య లేటెస్ట్ పిక్స్ చూస్తే అదే అనిపిస్తోంది. ఒక హీరో బ్రాండ్ ను ఇంకో హీరో..అది కూడా బాలయ్య లాంటి సీనియర్ హీరో ప్రమోట్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండకి సంబందించిన రౌడీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారా! బాలయ్య లేటెస్ట్ పిక్స్ చూస్తే అదే అనిపిస్తోంది. ఒక హీరో బ్రాండ్ ను ఇంకో హీరో..అది కూడా బాలయ్య లాంటి సీనియర్ హీరో ప్రమోట్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

హీరోగా కోట్లు సంపాదిస్తున్న మన టాలీవుడ్ స్టార్స్ సొంత వ్యాపారాలలోనూ బాగానే సంపాదిస్తున్నారు. మల్టీప్లెక్స్, హోటల్స్, రియల్ ఎస్టేట్, జువెల్లరీ బిజినెస్..ఇలా పలు రకాలైన వ్యాపారాలలో మన హీరోలు, హీరోయిన్లు బాగానే వెనకేసుకుంటున్నారు. ఇప్పటికే, విజయ్ దేవరకొండకి థియేటర్‌తో పాటు..విజయ్ సేల్స్..రౌడీ బ్రాండ్ క్లాత్స్ బిజినెస్ ఉంది. అయితే, తాజాగా నందమూరి బాలకృష్ణ, రౌడీ బ్రాండ్ టీ షర్ట్ ధరించి కనిపించడంతో ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ కూడా మన టాలీవుడ్ హీరో విజయ్ బ్రాండ్‌ను వాడటమే కాదు..ప్రమోట్ కూడా చేస్తున్నారని బాలయ్య అభిమానులు చెప్పుకుంటున్నారు. బాలయ్యకి విజయ్ దేవరకొండకి మంచి అనుబంధం ఉంది. బాలయ్య షో అన్‌స్టాపబుల్ కి విజయ్ వచ్చి సందడి చేశాడు. ఆ సమయంలో విజయ్ వ్యాపారాల గురించి కూడా బాలయ్య తన షోలో ప్రస్తావించాడు. ఆ, రకంగా బాలయ్య రౌడీ బ్రాండ్‌ను కూడా బాగానే వాడుతున్నాడని అర్థమవుతోంది. మొత్తానికి, ఇలా మన స్టార్స్ మధ్య సఖ్యత ఉండటం అభిమానులకి కన్నులపండుగ వంటిదని చెప్పాలి.

కాగా, బాలయ్య సినిమాల విషయానికొస్తే..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న దాదా చిత్రం ఈ డిసెంబర్ 24న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండ నటించిన రణబాలి..అక్టోబర్ 16న పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది.

#Balakrishna#NBK#Vijay Devarakonda#Tollywood#Rowdy Brands
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి