Srikanth Odela: సినిమా అంటేనే ఒక మ్యాజిక్. కొన్ని సన్నివేశాలు..పాత్రలు చిత్రీకరించినప్పుడు దర్శకులు లాజిక్‌లు వదిలేస్తారు. ఎందుకంటే అక్కడ ఏదో మ్యాజిక్ చూపించారు కాబట్టి. కానీ, ప్రేక్షకుల్లో కొంతమంది పక్కా లాజిక్కులే చూస్తారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఇప్పుడు ఆయన తీసిన ది ప్యారడైజ్ సినిమాలోని ఓ షాట్ ను రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని షాట్‌తో పోల్చి స్మూత్‌గా కౌంటర్ ఇచ్చాడు.
ఇప్పుడు, శ్రీకాంత్ చెప్పిన లాజికల్ పాయింట్ ఆలోచిస్తే కరెక్టే కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన సినిమాలలో చాలా సన్నివేశాలు కాపీ కొట్టి తీస్తారనే మచ్చ ఉంది. అది, నిజం కూడా. కథకుడు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా కొన్ని సీన్స్ విషయంలో లాజిక్ చూస్తే బ్యూటీ పోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, సీన్స్ ని హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టి రాస్తారు కదా..అన్న మాటకి ఇన్స్పైర్ అయి రాస్తాను అని కవర్ చేశాడు.
ఇక, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన మగధీర సినిమా ఎంతటి భారీ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో, గుర్రం.."ధీరా బాద్షా" అన్నప్పుడు గాలిలోకి ఎగిరి కాళ్ళతో తాడు విసిరేస్తుంది. అది చరణ్ పట్టుకుంటే..ఇసుక ఊబిలోనుంచి చరణ్‌ను బయటకి లాగుతుంది. ఇక్కడ లాజిక్ అనిపించదు. అప్పట్లో, కూడా దీని గురించి మాట్లాడుకున్నారు.
ఇప్పుడు, ఇదే విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పాయింట్ అవుట్ చేశాడు. నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమా ఇటీవల రిలీజై మిక్స్డ్ టాక్‌తో సందడి చేస్తోంది. ఈ సినిమాలో కుక్క ఎమోషన్ చూపిస్తుంది. కానీ, దీని గురించి చాలామంది నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. అందుకే, ఆ సినిమాలోని సీన్ ఉదాహరణను చూపిస్తూ తన సినిమాలోని పాయింట్ ని సమర్ధించుకుంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే, నేనే సరిగ్గా కన్వే చేయలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. మొత్తానికి, ఇప్పటి వరకూ ఏ దర్శకుడు రాజమౌళిని ఇలా నేరుగా పిన్ చేయలేదు. ఈ విషయంలో శ్రీకాంత్ గ్రేట్ అనుకోవాల్సిందే.









