Manasa Varanasi: దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాలో శర్వానంద్ జార్జ్ అండ్ క్రిష్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. రెండు వేర్వేరు పాత్రల్లో కామెడీ తో పాటు హీరోయిన్‌తో లవ్ ట్రాక్..ఫ్యామిలీ ఎమోషన్స్ భాగా ఉండబోతున్నాయి. ఆ మధ్య వచ్చిన కపుల్ ఫ్రెండీ సినిమాతో ఆకట్టుకున్న హీరోయిన్ మానస వారణాసి కి ఈ సినిమా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.
ఇక, శర్వా-మానసల మధ్య లవ్ స్టోరీ చాలా ట్రెండీగా ఉంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి నాన్ స్టాప్‌గా జరుగుతోంది. నవంబర్ వరకూ మొత్తం షూట్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టనున్నారు. 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే, ప్రీ బిజినెస్ కూడా జరిగినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇక, శర్వా-మానసల మధ్య వచ్చే ట్రాక్ కూడా చాలా ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని తెలుస్తోంది. రెగ్యులర్ గా మనం చూస్తున్న ప్రేమకథకు భిన్నంగా, ఇప్పటి యువత ఆలోచనలు, రిలేషన్‌షిప్ గోల్స్, సోషల్ మీడియా ప్రభావాన్ని టచ్ చేస్తూ ఈ మూవీలో ప్రేమ కథ సాగుతుందట. అలాగే, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో పాటు ఇద్దరి మధ్య జరిగే డ్రామా, ఫన్నీ కన్వర్సేషన్స్ కూడా వీళ్ల లవ్ ట్రాక్ కు మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను జత చేసినట్టుగా సమాచారం.
టాలీవుడ్‌లో మానస జర్నీ:
హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివింది. కొంతకాలం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత, అందాల పోటీల్లోకి అడుగుపెట్టి 2020లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అనంతరం మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొని టాప్ 13లో నిలిచారు.
‘దేవకీ నందన వాసుదేవ’తో హీరోయిన్‌గా ఎంట్రీ:
మానస వారణాసి సినీ ప్రయాణం ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో ప్రారంభమైంది. అశోక్ గల్లా హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె సత్యభామ పాత్రలో కనిపించారు. యాక్షన్, దైవిక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త హీరోయిన్‌గా మానసకు మంచి అవకాశం దక్కింది.
మానస నటించిన రెండవ సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్ సరసన నటించిన ఈ సినిమాలో ఆమె ‘మిత్ర’ పాత్రను పోషించారు. చెన్నై నేపథ్యంలో సాగే ఈ కథలో ఉద్యోగం కోసం నగరానికి వచ్చే యువతిగా మానస కనిపించారు. ఈ సినిమా తర్వాత మానసకు నటిగా మరింత గుర్తింపు వచ్చింది. గ్లామర్‌తో పాటు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు, శర్వా సరసన జార్జి క్రిష్ ఎంచుకుంది. ఫ్యూచర్‌లోనూ నటనతో పాటు గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీగా ఉంది.







