Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బన్నీ.. ఇకపై మరింత భారీ స్థాయి సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐకాన్ స్టార్ స్టైలిష్ కాప్‌గా నటించనున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్‌తో కలిసి ఓ భారీ చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే, అఫీషిల్‌గా కన్‌ఫర్మేషన్ కూడా వచ్చింది. లోకేష్ యూనివర్స్ తరహా యాక్షన్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్, విజయ్, కార్తీ, సూర్య వంటి స్టార్ హీరోలను తనదైన స్టైల్లో చూపించిన లోకేష్.. అల్లు అర్జున్‌తో సినిమాను చేయబోతుండటంతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో బాగా ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ని స్టైలిష్ కాప్‌గా చూపించబోతున్నాడని తాజా సమాచారం.
అల్లు అర్జున్ గతంలో పోలీస్ పాత్రల్లో కనిపించినన్నప్పటికీ.. లోకేష్ కనగరాజ్ మేకింగ్‌లో బన్నీని చూడటం మాత్రం పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వడం గ్యారెంటీ. లోకేష్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ సాధారణంగా చాలా స్టైలిష్‌గా, మాస్ అప్పీల్‌తో ఉంటుంది. అందులోనూ గన్ యాక్షన్, రా యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి దర్శకుడి చేతిలో అల్లు అర్జున్ లాంటి పెర్ఫార్మర్ పడితే స్క్రీన్‌పై కాంబినేషన్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.
ఒకవేళ బన్నీ నిజంగానే పవర్‌ఫుల్ కాప్ పాత్రలో నటిస్తే.. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బాక్సాఫీ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదవడం పక్కా.
అల్లు అర్జున్ ‘రాకా’.. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ‘రాకా’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. ‘జవాన్’తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫాంటసీ అంశాలతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.








