సినిమా

Venkatesh: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’.. మాస్ సాంగ్ రిలీజ్.!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Venkatesh: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’.. మాస్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండవుతూ క్షణాల్లో వందలకొద్దీ వ్యూస్ రాబడుతోంది. ముఖ్యంగా డాన్స్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ అందించిన మాసివ్ స్టెప్స్ బావున్నాయి. వెంకీకి ఎలాంటి సాంగ్ పడితే థియోటర్స్‌లో ఆడియన్స్ లేచి డాన్స్ చేస్తారో అలాంటి మాస్ స్టెప్స్‌ను కంపోజ్ చేశారు భాను.

Venkatesh: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’.. మాస్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండవుతూ క్షణాల్లో వందలకొద్దీ వ్యూస్ రాబడుతోంది. ముఖ్యంగా డాన్స్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ అందించిన మాసివ్ స్టెప్స్ బావున్నాయి. వెంకీకి ఎలాంటి సాంగ్ పడితే థియోటర్స్‌లో ఆడియన్స్ లేచి డాన్స్ చేస్తారో అలాంటి మాస్ స్టెప్స్‌ను కంపోజ్ చేశారు భాను.

‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అక్టోబర్ 9న. వాస్తవానికి, అక్టోబర్ 2నే రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ, దసరా హాలిడేస్ ముందు అయితే సినిమాకి బాగా కలిసి వస్తుందని విడుదల తేదీని మళ్ళీ మార్చారు. అయినా, కూడా ఈ సినిమాకి ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదంటూ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. సరిగ్గా, ఇదే సమయంలో సాలీడ్ మాస్ సాంగ్‌ను వదిలారు.

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్‌తో పాటు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా అర్థమైంది. ఇక, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. రామ్ మిరియాల, ప్రభా ఈ పాటను ఆలపించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటలో మాస్ బీట్‌తో పాటు ఫోక్ టచ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘నారాయణమ్మ’ పాటలో వెంకటేష్‌తో కలిసి శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి మాస్ స్టెప్పులేయడం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ వేసే స్టెప్పులు పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారనున్నాయి. కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించినట్లు చిత్రబృందం వెల్లడించింది.

#Aadarsha Kutumbam#Venkatesh#Srinidhi Setty#Trivikram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి