సినిమా

NBK-DaDa: మైసూర్‌లో ‘దాదా’ సందడి..కొత్త షెడ్యూల్‌లో బాలయ్య

రచన: Anshu••4 నిమిషాల పఠనం

NBK-DaDa: గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘దాదా’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మైసూర్‌లో ప్రారంభమైనట్లు సమాచారం.

మైసూర్‌లో కీలక షెడ్యూల్..జాయిన్ అయిన బాలకృష్ణ:

‘దాదా’ మూవీ షూటింగ్‌ను మైసూర్‌లో ప్రారంభించిన చిత్రబృందం.. అక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సినిమా కథకు కీలకంగా నిలిచే సన్నివేశాలతో పాటు బాలకృష్ణకు సంబంధించిన ముఖ్యమైన సీన్లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యను పవర్ ఫుల్ మాఫియా డాన్ గా చూపించబోతున్నాడు.

బాలకృష్ణ సినిమాల్లో మాస్ యాక్షన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ‘దాదా’లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? గత చిత్రాలకు భిన్నంగా ఏదైనా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సినిమా టైటిల్ కూడా క్యారెక్టర్‌పై ఆసక్తిని పెంచుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల వచ్చిన టీజర్ గ్లింప్స్ లో గోపీచంద్ మలినేని సరికొత్త మేకోవర్‌తో బాలయ్యను చూపించబోతున్నాడని అర్థమైంది. ఆయన మాస్ ఇమేజ్‌కి తగ్గ పాత్రను డిజైన్ చేశాడు. ఒకరకంగా దాదా మూవీలో బాలయ్య పాత్ర ఐ ఫీస్ట్‌లా ఉంటుందనడంలో సందేహమే లేదు.

ఈ సినిమా తర్వాత బాలయ్య కొరటాల శివ దర్శకత్వంలో ఓ పవర్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే, షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశారు. డిసెంబర్ 24న దాదా రిలీజ్ కాబోతుంది. దీని, తర్వాత కొరటాల సినిమాలో జాయిన్ కానున్నాడు. అప్పటి వరకూ మిగతా నటీనటులతో షూట్ చేయనున్నాడు. ఇక, 2027 సమ్మర్ లేదా దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

#Nandamuri Balakrishna#Gopichand Malineni#Dada#Kajal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి