తెలంగాణ

Kedarnath: కేదార్‌నాథ్‌లో కొండచరియల బీభత్సం.. ఘాట్ రోడ్డులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు!

రచన: Mahesh••2 నిమిషాల పఠనం

Kedarnath: కేదార్‌నాథ్ ఘాట్ రోడ్‌లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. గౌరీకుండ్ సమీపంలోని కొండ ప్రాంతం ఒక్కసారిగా కుప్పకూలి పడటంతో రాళ్లు, మట్టి పెళ్లలు రోడ్డుపైకి వచ్చాయి. ఘాట్ రోడ్డుపై రాకపోకలు హఠాత్తుగా స్తంభించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, దాదాపు 10 వేల మంది భక్తులు ఘాట్ మార్గంలోనే చిక్కుకుపోయారు.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 40 మంది యాత్రికులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరానికి చెందిన పీవీ కృష్ణారెడ్డితో పాటు పలువురు యాత్రికులు మధ్యాహ్నం 3 గంటల నుంచే వాహనాల్లో బందీలుగా ఉండిపోయారు. కొండ ప్రాంతంలో తీవ్రమైన చలి, మరోవైపు తాగునీరు, ఆహారం లభించని విపత్కర పరిస్థితుల్లో తెలుగు భక్తులు తీవ్ర భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు. రహదారిని క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు సహాయక సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

#Kedarnath#Kedarnath Landslide#Uttarakhand#Gaurikund#Landslide#Telugu Pilgrims#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి