Trivikram: ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం సినిమాకి ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే సినిమా జనాలలోకి వెళ్ళడం కష్టంగా మారింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా ప్రమోషన్స్ మొదలవక పోతే ఎలా అని వెంకీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 9న రిలీజ్ అన్న ఈ మూవీకి ప్రమోషన్స్ నిల్ గా కనిపిస్తున్నాయి.
‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఆల్రెడీ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెరిగినప్పటికీ, ఆ అంచనాలు ప్రేక్షకుల్లోకి ఇంకా బలంగా వెళ్ళాలంటే సాలిడ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. ఈ మూవీలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ అలాగే, ఫన్ ఎలిమెంట్స్ ను హైలైట్ చేస్తూ పాత్రల పరిచయ వీడియోలు, షార్ట్ వీడియోలు, ఫన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో వరుసగా రిలీజ్ చేయడం వల్ల ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అవుతుంది.
ఇటువంటివి ఇంకా రిలీజ్ చేయాలని..వెంకీ అభిమానులు, నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. వాస్తవానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని అలాగే, ఫ్యామిలీ మీట్, కాలేజ్ ఈవెంట్స్ లాంటి ఇంటరాక్టివ్ ఈవెంట్స్ గనక త్రివిక్రమ్ ప్లాన్ చేస్తే ఉన్న ఈ తక్కువ టైమ్ లోనే ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీద ఆసక్తి మరింతగా పెరుగుతుంది. ఇవన్నీ, గతంలో చాలా సినిమాలకి మేకర్స్ చేశారు. అలా చేయడం వల్ల సినిమా సక్సెస్‌కి బాగా హెల్ప్ అవుతుంది.
వీటితో పాటు, ఇన్స్టాలో ఫాలోవర్స్ బాగా ఉన్న వాళ్ళతో ట్రెండింగ్ రీల్స్, మీమ్స్, సెలబ్రిటీ రియాక్షన్స్ తో వీడియోలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ కంటెంట్‌ను ఇంకా వైరల్ అయ్యేలా ప్లాన్ చేయాలి. ఈ విధంగా థియేట్రికల్ కంటెంట్‌తో పాటు డిజిటల్ ప్రమోషన్స్ కూడా కలిపి చేస్తే సినిమాకు మరింతగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది.
చూడాలి, మరి..‘ఆదర్శ కుటుంబం’ విషయంలో గురూజీ ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడో. కాగా, ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డింపుల్ హయాతి స్పెషల్ నంబర్‌లో కనిపించబోతోంది.







