సినిమా

Devara 2: దేవర 2 లేనట్టేనా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో పెరుగుతున్న అనుమానాలు!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. రచయిత, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని మొదటి నుంచే ప్రచారం జరిగింది. పార్ట్ 1 క్లైమాక్స్‌లో కూడా ఈ విషయాన్ని రివీల్ చేశారు. అయితే, ఇప్పుడు ‘దేవర 2’ విషయంలో వస్తున్న కొన్ని వార్తలు అభిమానుల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అసలు నిజంగానే ‘దేవర 2’ ఉంటుందా? లేక ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడినట్టేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర 1తోనే కథ ముగిసిందా?

‘దేవర’ను మొదట రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచనతోనే రూపొందించినట్లు కొరటాల బృందం గతంలో వెల్లడించింది. మొదటి భాగంలో కొన్ని కీలక ప్రశ్నలను వదిలిపెట్టడం, పాత్రల భవిష్యత్తుపై ఆసక్తిని పెంచడం కూడా రెండో భాగానికి బలమైన పునాది వేసినట్టుగా అనిపించింది. అయితే, ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అవుతుండటం, ఆయన లైనప్‌లో భారీ సినిమాలు చేడటంతో ‘దేవర 2’ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్న తారా..దీని తర్వాత త్రివిక్రమ్మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా 2027 జనవరి నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. ఈ రెండు పాన్ ఇండియా స్కేల్‌లో తెరకెక్కేవే. కాబట్టి, ఒక్కో సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.

అయితే, గతంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం ‘దేవర 2’ను ఈ పాటికే పట్టాలెక్కించాల్సింది. కానీ, ప్రస్తుతం ఉన్న తారక్ సినిమాల లైనప్ చూస్తుంటే అంత సులభం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొరటాల శివ కూడా తన తదుపరి ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి పెట్టాల్సి ఉంది. నందమూరి బాలకృష్ణతో కొరటాల సినిమాను చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రానుంది. దీంతో ఇద్దరి డేట్స్, కథకు కావాల్సిన భారీ స్కేల్, నిర్మాణ సమయం వంటి అంశాలు ‘దేవర 2’పై ప్రభావం చూపే అవకాశముంది. అందుకే, తాత్కాలికంగా ఈ సినిమా ఉండదన్న వార్తలు ప్రచారమవుతున్నాయి. తాజాగా, దేవర వచ్చి 2ఏళ్ళు అయిన నేపథ్యంలో కొత్త పోస్టర్ ని వదిలారు. దీనిలో కూడా దేవర 2 ప్రస్థావన కనిపించలేదు. అందుకే, అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

#devara#devara 2#ntr#koratala shiva
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి