టాప్ న్యూస్

mobile plans : ఇకపై ఏడాదికి 13 కాదు 12 రీచార్జులే.. 30 డేస్ ప్లాన్స్ వచ్చేశాయ్!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దేశంలోని మొబైల్ యూజర్లకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. ఇంతకాలం డేటా వినియోగం అవసరం లేకున్నా 1జీబీ లేదా 2జీబీ డేటా ప్లాన్లతో కూడిన రీచార్జ్ ప్లాన్లను ఎంచుకోవాల్సి వచ్చేది.ఇకమీదట దాని అవసరం లేదని సమాచారం.కేవలం ఏడాదికి 12 సార్లు.. అనగా నెలకు ఒకసారి రీచార్జ్ చేసుకుంటే సరిపోతుందని.. ఈ మేరకు కొత్త ప్లాన్స్ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

దేశంలోని మొబైల్ యూజర్లకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. ఇంతకాలం డేటా వినియోగం అవసరం లేకున్నా 1జీబీ లేదా 2జీబీ డేటా ప్లాన్లతో కూడిన రీచార్జ్ ప్లాన్లను ఎంచుకోవాల్సి వచ్చేది.ఇకమీదట దాని అవసరం లేదని సమాచారం.కేవలం ఏడాదికి 12 సార్లు.. అనగా నెలకు ఒకసారి రీచార్జ్ చేసుకుంటే సరిపోతుందని.. ఈ మేరకు కొత్త ప్లాన్స్ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

మొన్నటివరకు నెలలో 28 రోజులకు మాత్రమే డేటా ప్లాన్స్ అందుబాటులో ఉండేవి ఇకమీదట నెలలో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్స్-2026ను ప్రభుత్వం తీసుకొచ్చిందని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ మార్పులతో మొబైల్ యూజర్లు మరిన్ని రీచార్జ్ ఆప్షన్లు, సౌకర్యం లభిస్తుందని వెల్లడించారు.

కొత్త రూల్స్ ప్రకారం.. ఏడాదికి 13 సార్లు నెలవారీ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్‌ను 12 రీచార్జ్‌లతో సరిపెట్టుకోవచ్చని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. డేటా అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలతో కూడిన ప్లాన్స్ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కేవలం వాయిస్ కాల్స్ కోసమే మొబైల్ ఉపయోగించే వారికి ఈ బడ్జెట్ ప్లాన్స్ మరింత అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు.

గతంలో పరిమితంగా, సౌకర్యవంతంగా లేని రీచార్జ్ ఆప్షన్లపై పలువురు తనకు ఫిర్యాదు చేశారని రాఘవ్ చద్దా గుర్తుచేశారు. ఈ సమస్యను మార్చి 11న పార్లమెంట్‌లో ప్రస్తావించానని చెప్పారు. వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, అందుబాటు ధరల్లో రీచార్జ్ ప్లాన్స్ కల్పించాలని కోరినట్లు స్పష్టంచేశారు. వినియోగదారుల ఎంపిక, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను పరిష్కరించినందుకు కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా చెప్పుకొచ్చారు.

#mobile users#new recharge plans#TRAI#guidelines#30days recharge plans#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి