SS.Rajamouli: ఒక్కో దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. కొందరు కామెడీ బాగా డీల్ చేయగలరు. కాబట్టి, కథలో ఎక్కువ స్పేస్ కామెడీకే ఇస్తుంటారు. ఆ జానర్ సినిమాలతో అగ్ర దర్శకులుగా వెలిగింది అంటే జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ. సుకుమార్ అంటే కొన్ని లెక్కలుంటాయి. సినిమా కథ చుట్టూ మ్యాథ్స్ కనిపిస్తుంటుంది. పూరి జగన్నాధ్ అంటే ఆయన కథలో హీరోలు చాలా రఫ్ అండ్ ఠఫ్‌గా ఉంటారు. దాదాపుగా ఆయన సినిమాలో హీరో ఓ అనాధగా కకనిపిస్తుంటాడు.
సొసైటీలో అనాధగా పెరిగిన వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని బలంగా నమ్మేదర్శకుడీయన. ఇప్పుడున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి మంచి కామెడీ..చిన్న ఎమోషనల్ టచ్..ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకొని రాసుకునే సన్నివేశాలు..ఇవి అనిల్ రావిపూడి సక్సెస్ మంత్రం. అలాగే, మన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి మూడు బలమైన అంశాలు ఆయన అనుకున్న కథలో ఉండాలి. అవి ఉంటేనే జక్కన్న సినిమా బ్లాక్ బస్టర్.
ఆ మూడు ఎలిమేంట్స్ ఏంటీ?
స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి గత చిత్ర ఆర్ఆర్ఆర్ వరకూ రాజమౌళి కథలన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ, ఆ సింపుల్ కథకే ఎమోషన్స్, ఎలివేషన్స్, భారీ విలన్. ఈ మూడు ఉంటే జక్కన్న కథను అద్భుతంగా నడిపించడంలో దిట్ట. కథ మొదలైనప్పటి నుంచి ఆడియన్స్‌ను రిలాక్స్ అవనిస్తూనే..ఎమోషన్స్‌తో కట్టి పడేతుంటాడు. మధ్యలో కాస్త కామెడితో నవ్విస్తాడు. విలన్ వచ్చినప్పుడు భయపెడతాడు.
విజన్ పరంగా రాజమౌళి స్కేల్ భారీ స్థాయిలో ఉంటుంది. బలమైన విలన్ ఉంటే ఆ విలన్ కొట్టినప్పుడు హీరో ఇంకా బలంగా కనిపిస్తాడు కాబట్టి..ప్రేక్షకుల దృష్ఠిలో హీరో ఎలివేట్ అవుతాడు. ఇక, హీరో ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. దాని కోసం చాలా వర్షన్స్ రాయిస్తాడు. కాబట్టే ఆయన సినిమాలో హీరో ఎలివేషన్ అదిరిపోతుంది. ఇక, విజువల్స్ పరంగా చాలా వండర్ అనిపించేలా గ్రాఫిక్స్, వీఎఫెక్స్ ఉపయోగిస్తుంటాడు. ఈ మూడు, రాజమౌళికి సక్సెస్ మీటర్‌లో భాగాలు. కాబట్టే, ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. అంతేకాదు, మన ఇండియన్ సినిమాను ప్రపంచదేశాలకి చాటి చెప్పాడు. మన తెలుగు సినిమా మార్కెట్‌ను అమాంతం ఆకాశానికి ఎత్తాడు. ఇప్పుడు, రాబోతున్న వారణాసి సినిమాలో సరికొత్త సంచలనాలను సృష్ఠించబోతున్నాడు.








