తెలంగాణ

యూఎల్‌సీ పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్: మంత్రి పొంగులేటి

రచన: Swechaanews Chairman••4 నిమిషాల పఠనం

దశాబ్దాలుగా నానబెడుతూ పెండింగ్‌లో ఉంచిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం కలిగిస్తూ ప్రజా ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ULC కేసులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం వెంటనే క్రమబద్ధీకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

 దశాబ్దాలుగా నానబెడుతూ పెండింగ్‌లో ఉంచిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం కలిగిస్తూ ప్రజా ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ULC కేసులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం వెంటనే క్రమబద్ధీకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 జీవోలు 455, 456, 747, మరియు 92 ల కింద నిలిచిపోయిన ULC పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం తాజాగా 'మెమో నంబర్ 48062'ను జారీ చేసిందని మంత్రి వివరించారు. 2016లోనే సంబంధిత జీవోలు జారీ అయినప్పటికీ, గత ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించి సామాన్య భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆయన విమర్శించారు. తాజా ఉత్తర్వులతో దశాబ్దాల తరబడి నలుగుతున్న ఈ భూ చిక్కుముడులకు పూర్తి పరిష్కారం లభించనుందని ధీమా వ్యక్తం చేశారు.

 శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు తమ ప్రభుత్వం వేగంగా కార్యరూపం దాల్చుతోందని, నిషేధిత జాబితా అయిన Section 22-A భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. 22-A సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే మూడు కీలక నిర్ణయాలు తీసుకుందని, జీవో 118, జీవో 76లకు అనుగుణంగా స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు కూడా వెలువరించామని ఆయన గుర్తుచేశారు.

 ఈ నిర్ణయాల వల్ల 22-A జాబితాలో ఉన్నప్పటికీ సక్రమ అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు మరియు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైందని స్పష్టం చేశారు. తాజాగా జారీ చేసిన ULC ఉత్తర్వుల ద్వారా వేలాది కుటుంబాలకు ఊరట లభించడమే కాకుండా, వారి ఆస్తులకు చట్టబద్ధత చేకూరుతుందని వెల్లడించారు. మిగిలి ఉన్న ఇతర 22-A సంబంధిత భూ సమస్యలను కూడా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

 

#PonguletiSrinivasReddy#ULCApplications#TelanganaRevenue#Section22A#RevanthGovt#TelanganaNews#HyderabadRealEstate
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి