తెలంగాణ

AIMIM : ‘ఎస్ఐఆర్’ కరెక్ట్ కాదు..సుప్రీంకోర్టు సమర్థించడం ఆశ్చర్యకరం : ఎంపీ అసద్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అమలు తీరుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ వలన దేశంలోని పేదప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. డాక్యుమెంట్ల కోసం తిరుగుతూ వారి ఆత్మగౌరవం మంటగలుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అమలు తీరుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ వలన దేశంలోని పేదప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. డాక్యుమెంట్ల కోసం తిరుగుతూ వారి ఆత్మగౌరవం మంటగలుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటి నుంచీ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఒవైసీ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించడం ఆశ్చర్యకరం అని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు మెజారిటీ ఓటింగ్ ఆధారంగా జరగాలని ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎస్ఐఆర్‌పై నిర్ణయం తీసుకునే క్రమంలో మెజారిటీతో తీసుకున్నారో దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు.ఇద్దరు ఎన్నికల కమిషనర్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారని.. ఈ మేరకు తమ అసమ్మతి నోట్లను సమర్పించారని, మెజారిటీతో నిర్ణయాలు తీసుకోకపోతే వాటి చట్టబద్ధత ఏమవుతుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ వలన నిరుపేదలు బయటకు చెప్పుకోలేని బాధలు పడుతున్నారన్నారు. వివిధ ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు.ఈ భారాన్ని పేదలు ఎలా మోయగలరని, ఎస్ఐఆర్‌ను ఎలా ఎదుర్కొంటారో అర్థం కావడం లేదన్నారు.

ఇదిలాఉండగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎంపీ అసదుద్దీన్ కీలక ప్రశ్నలు సంధించారు. తుది ఎస్‌ఐఆర్ జాబితాలో పేర్లు రాని వారి పరిస్థితి ఏమిటో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాబితాలో పేర్లు గల్లంతైన వారి పిల్లలు, కుమారులు, కుమార్తెలు, మనుమలు తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలో వివరించాలని కోరారు. ఒకవేళ తల్లిదండ్రులు, తాత, మామల పేర్లు జాబితాలో లేకపోతే, వారు ఎవరితో తమ వంశపారంపర్య సంబంధాన్ని సరిపోల్చుకోవాలని ఓవైసీ ప్రశ్నలు గుప్పించారు.

#AIMIM#mp asaduddin#SIR#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి