తెలంగాణ

Viral : ఆస్తి కోసం బరితెగింపు.. మంచం పట్టిన తల్లిని కూడా వదల్లేదు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఆస్తి కోసం కొందరు బరితెగిస్తున్నారు.రక్తసంబంధం, తల్లిదండ్రులు అని చూడటం లేదు. తమకు ఆస్తి రాలేదు అన్న కోపంలో కన్నవారి మీదే దాడులకు పాల్పడుతున్నారు. కొందరు ఇంట్లో నుంచి బయటకు గెంటివేస్తున్నారు. మరికొందరు భౌతికంగా దాడులకు పాల్పడటం, ఆహారం ఇవ్వకుండా తీవ్ర వేధింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారు.

ఆస్తి కోసం కొందరు బరితెగిస్తున్నారు.రక్తసంబంధం, తల్లిదండ్రులు అని చూడటం లేదు. తమకు ఆస్తి రాలేదు అన్న కోపంలో కన్నవారి మీదే దాడులకు పాల్పడుతున్నారు. కొందరు ఇంట్లో నుంచి బయటకు గెంటివేస్తున్నారు. మరికొందరు భౌతికంగా దాడులకు పాల్పడటం, ఆహారం ఇవ్వకుండా తీవ్ర వేధింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ఆస్తి కోసం ఏకంగా హత్యలు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.

నేటి సమాజంలో కొందరు డబ్బు, ఆస్తి పాస్తులు, హోదా మాత్రమే చూస్తున్నారు. మనుషులకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. కేవలం కొడుకులే ఇలా చేస్తున్నారంటే తప్పు.. కూతుర్లు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. డబ్బులు ఇస్తే, ఆస్తి పాస్తులు సంపాదించి ఇస్తేనే తల్లిదండ్రులను, అత్తమామలను మంచి చూసుకుంటున్నారు.లేదంటే వారి మీద కర్కశత్వం చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసింది.

ఆస్తి కోసం పక్షవాతంతో మంచానికే పరిమితమైన తల్లిపైన కొడుకు అతని భార్య దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకివెళితే.. కూకట్‌పల్లి అల్విన్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి టి. నాగార్జునను గత కొంతకాలంగా అన్న, వదిన, ఆమె సోదరుడి వేధిస్తున్నట్టు ఆరోపించాడు.

ఆస్తి వివాదంలో వాళ్లంతా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారని వాపోయాడు.తనతో పాటు పక్షవాతంతో బాధపడుతున్న తల్లిపైనా పలుమార్లు భౌతిక దాడులు చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. కొన్ని ఘటనలు సీసీటీవీలో రికార్డయ్యాయని నాగార్జున వెల్లడించారు. వారు చేసిన దాడుల్లో తనకు, తన తల్లికి గాయాలయ్యాయని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆరోపించారు.తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు. అయితే, ఆస్తి కోసం కుటుంబీకులు నాగార్జున, అతని తల్లిపై దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Assets#money#harrasment#family members#kukatpally#video viral#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి