తెలంగాణ

TG : ఓటు చోరీ కాదు.. రాహుల్ గాంధీ బుద్ధి చోరీ : ఎంపీ అర్వింద్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దేశంలో ఓటు చోరీ జరిగిందని, కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్ సాయంతో అధికారంలోకి వస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.

దేశంలో ఓటు చోరీ జరిగిందని, కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్ సాయంతో అధికారంలోకి వస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో ఓట్ చోరీ కాదు.. రాహుల్ గాంధీ అఖల్ చోరీ’ జరుగుతోందని సెటైర్లు వేశారు.

విపక్ష పార్టీలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఎలక్షన్ కమిషన్‌లో అభిప్రాయభేదాలు ఉండటం సహజమని పేర్కొన్న ఎంపీ అర్వింద్.. రాజ్యాంగబద్ధంగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గాంధీ కుటుంబానికి ఇలాంటివి ఏవీ అర్థం కావని ఫైర్ అయ్యారు. SIRలో భాగంగా ఎన్‌రోల్‌మెంట్ కోసం వస్తే మహేశ్ గౌడ్ స్పందించలేదని గుర్తుచేశారు.

అందుకే పీసీసీ చీఫ్‌‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందని ధర్మపురి అర్వింద్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. అసలు రాహుల్ గాంధీని చూసి ఓటేస్తారా? అంటూ ఛలోక్తులు విసిరారు. దేశంలో ‘ఓట్‌ చోరీ కాదని.. రాహుల్ అఖల్‌ చోరీ’ అంటూ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

అధికారం రావడం లేదని చివరకు కాంగ్రెస్ పార్టీ దేశద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు.ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపేందుకు కూడా వెనుకాడలేదని పేర్కొన్నారు. దేశంలో రాహుల్ గాంధీ లాంటి విపక్ష నాయకుడు ఉండటం దురదృష్టకరమని చెప్పారు. పచ్చకామెర్లు ఉన్నోడికి.. లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అఘాయిత్యాలు ఇతర పార్టీలు కూడా చేస్తాయని అనుకోవద్దని ధర్మపురి అర్వింద్ హితవు పలికారు.ఇదిలాఉండగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని పేర్కొంటూ రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

#mp arvind#congress#rahulgandi#vote chori#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి