National

రూ.500 టికెట్‌తో మారిన తలరాత.. రూ.30కోట్ల జాక్‌పాట్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

కేరళ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రసిద్ధ 'తిరువోణం బంపర్ లాటరీ' (BR-111) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాదికి సంబంధించి ఏకంగా రూ.30 కోట్ల భారీ ప్రథమ బహుమతిని ఓ అదృష్టశాలి గెలుచుకున్నారు. శనివారం మధ్యాహ్నం తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో అధికారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ లాటరీ డ్రా ప్రక్రియను పూర్తి చేశారు.

కేరళ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రసిద్ధ 'తిరువోణం బంపర్ లాటరీ' (BR-111) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాదికి సంబంధించి ఏకంగా రూ.30 కోట్ల భారీ ప్రథమ బహుమతిని ఓ అదృష్టశాలి గెలుచుకున్నారు. శనివారం మధ్యాహ్నం తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో అధికారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ లాటరీ డ్రా ప్రక్రియను పూర్తి చేశారు. రూ.500 విలువ చేసే టికెట్‌తో ఒక సామాన్యుడిని ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేసిన ఈ విజయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ డ్రాలో 'TL 360615' నంబర్ గల లాటరీ టిక్కెట్‌కు మొదటి బహుమతి రూ.30కోట్లు వరించింది. కన్నూర్ జిల్లా చక్కరక్కల్ ప్రాంతంలో ఉన్న ముత్తు లాటరీ ఏజెన్సీ ప్రతినిధి ఈ విజేత టిక్కెట్‌ను విక్రయించినట్లు లాటరీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈసారి ఓణం బంపర్ లాటరీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో, రూ.500ధరతో ముద్రించిన మొత్తం 90లక్షల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. లాటరీ చరిత్రలోనే ముద్రించిన అన్ని టికెట్లు అమ్ముడుపోవడం ఇది తొలిసారి కాగా, ప్రభుత్వానికి రూ.450 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈసారి ప్రథమ బహుమతే కాకుండా ద్వితీయ బహుమతిగా ఏకంగా 20మందికి తలా రూ.1కోటి చొప్పున నగదు పురస్కారాలు దక్కాయి. TA 957486, TB 642974, TC 810428 వంటి పలు సిరీస్ నంబర్లకు ఈ కోటి రూపాయల జాక్‌పాట్ లభించింది. ఇవే కాకుండా రూ.25లక్షల నుంచి రూ.500 వరకు వేల సంఖ్యలో ఇతర బహుమతులను కూడా కేటాయించారు. పూర్తి విజేతల జాబితాను లాటరీ విభాగానికి చెందిన అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.

అయితే మొదటి బహుమతి గెలుచుకున్న వ్యక్తికి ప్రామిస్ చేసిన రూ.30 కోట్లు పూచీగా చేతికి రావు. నిబంధనల ప్రకారం వర్తించే ఆదాయపు పన్ను, ఏజెన్సీ కమిషన్, సర్‌ఛార్జ్ మరియు సెస్ మినహాయించిన తర్వాతే మిగిలిన మొత్తాన్ని విజేత బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం రూ.30 కోట్లు గెలుచుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. విజేత తన ఒరిజినల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డులను సమర్పించి బహుమతి నగదును క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంది.

#KeralaThiruvanamBumper#OnamBumperLottery#KeralaLotteryResults#JackpotWinner#OffbeatNewsTelugu#KeralaNews#LotteryWinner
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి