వైరల్ న్యూస్

చనిపోయాడనుకున్న వ్యక్తి పునర్జన్మ.. అంత్యక్రియల దారిలో లేచి కూర్చున్న వృద్ధుడు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

వైద్యులు మృతి చెందాడని నిర్ధారించిన వ్యక్తి, అంత్యక్రియలకు శవాన్ని తరలిస్తుండగా అకస్మాత్తుగా లేచి కూర్చున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.

 వైద్యులు మృతి చెందాడని నిర్ధారించిన వ్యక్తి, అంత్యక్రియలకు శవాన్ని తరలిస్తుండగా అకస్మాత్తుగా లేచి కూర్చున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న శంకరయ్య శనివారం మృతి చెందినట్లు అక్కడ పనిచేస్తున్న వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఈ ఉత్కంఠ భరిత ఘటనకు దారితీసింది.

 వైద్యుల ప్రకటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు, గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రి  నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే, ప్రయాణ మార్గంలో జోగాపూర్ గ్రామం సమీపంలోకి రాగానే, మృతదేహంగా భావించిన శంకరయ్య అకస్మాత్తుగా అంబులెన్స్‌లోనే లేచి కూర్చున్నాడు. ఈ ఊహించని పరిణామంతో అంబులెన్స్‌లో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ పిమ్మట అపారమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 శంకరయ్య లేచి కూర్చోవడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, అంబులెన్స్‌ను సమీపంలోని వేములవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శంకరయ్యను పరీక్షించిన వైద్యులు ఆయన బతికే ఉన్నాడని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని స్పష్టం చేశారు. తండ్రి మరణవార్త విని గల్ఫ్ దేశాల నుంచి అత్యవసరంగా భారత్‌కు బయల్దేరిన  ఆయన కుమారులకు, తండ్రి సురక్షితంగా ఉన్నాడనే వార్త తెలియడంతో గొప్ప ఊరట లభించింది.

 మరణించాడనుకున్న శంకరయ్య సురక్షితంగా బతికి వచ్చాడనే వార్త క్షణాల్లో గ్రామంలో వ్యాపించడంతో సనుగుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వింత ఘటన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు, బంధువులు, ఆత్మీయులు శంకరయ్యను చూసేందుకు ఆసుపత్రికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాగా, ప్రాణంతో ఉన్న వ్యక్తిని మృతి చెందినట్లు ప్రకటించిన కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

#MiracleIncident#KarimnagarNews#Vemulawada#Sircilla#TelanganaNews#HealthNewsTelugu#MedicalNegligence
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి