వ్యాపారం

వారంలో భారీగా తగ్గిన పసిడి.. హైదరాబాద్‌లో ఇవే తాజా రేట్లు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లోనే 10 గ్రాముల తులానికి ఏకంగా రూ.3,160 మేర తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాల కారణంగానే దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు వరుసగా క్షీణిస్తున్నాయని బులియన్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

 అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే బలమైన అంచనాలతో పాటు యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు (యీల్డ్స్) గణనీయంగా పెరిగాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం కంటే బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మక్కువ చూపడంతో పసిడి అమ్మకాలు పెరిగి అంతర్జాతీయంగా ధరలు పడిపోయాయి. దీనికి తోడు దేశీయ మార్కెట్‌లో కూడా పసిడికి డిమాండ్ తాత్కాలికంగా మందగించడం ఈ ధరల తగ్గుదలకు మరో కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

 ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర రూ.1,52,680 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,39,950 వద్ద స్థిరపడింది. అలాగే 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,14,510గా ఉంటే, పారిశ్రామికంగా, ఆభరణాలకు విరివిగా వాడే కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి తదితర ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు అమలులో ఉన్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా లేదా పండుగ సీజన్ ప్రారంభంతో మళ్లీ పుంజుకుంటాయా అనేది మున్ముందు తేలనుంది.

#GoldPriceDrop#HyderabadBullion#GoldRateToday#BusinessNewsTelugu#SilverPrice#GoldMarketUpdates#TelanganaNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి