తెలంగాణ

KTR : పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సరిగ్గా రెండేళ్లు.. యాక్షన్ ఏది? : కేటీఆర్

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి రుజువులను సైతం ఏదో ఒక సందర్భంలో మీడియా ముందు పెడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి రుజువులను సైతం ఏదో ఒక సందర్భంలో మీడియా ముందు పెడుతున్నారు. అందుకు అధికార పార్టీ నుంచి సైతం దీటుగా సమాధానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. సరిగ్గా రెండేండ్ల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద జరిగిన ఈడీ దాడులను ఆయన ప్రస్తావించారు.

‘రాష్ట్రంలో ‘కాంగ్రెస్-బీజేపీ’ మధ్య అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది’ అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదిగా స్పందించారు. మనీలాండరింగ్ కేసులో 2024 సెప్టెంబర్ 27న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు,ఆయన బినామీ ఇళ్లపై ఏకకాలంలో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారని, ఆ టైంలో మంత్రి ఇంటికి నగదు లెక్కింపు యంత్రాలు తరలించినట్టు వార్తలు వచ్చాయని గుర్తుచేశారు.

సోదాలు జరిగిన తర్వాత ఇప్పటివరకు ఈడీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదన్నారు. సోదాల్లో ఏం స్వాధీనం చేసుకున్నారో కూడా బయటకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రయోగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి విషయంలో ఈడీ, కేంద్రం పూర్తిగా మౌనం వహించిందన్నారు.

కాంగ్రెస్ మంత్రికి బీజేపీ నుంచి ఇలాంటి మినహాయింపు ఎందుకు లభిస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య సంబంధాన్ని ఉద్దేశిస్తూ ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ అంటూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పొంగులేటి‌పై ఈడీ రెయిడ్స్ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ జేబు సంస్థ ఈడీనే సైలెంట్ చేసిన అసలైన 'కేడీ' బాంబులేటి అంటూ సెటైర్ వేసింది. విపక్షాలపై ఎగిరెగిరిపడే బీజేపీ పెంపుడు సంస్థ ఈడీ.. కాంగ్రెస్ మంత్రి 'బాంబులేటి' ఇళ్లపై దాడులు చేసి నేటితో రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేదని పేర్కొంది. బీజేపీ - కాంగ్రెస్ మధ్య నడుస్తున్న 'చీకటి బంధానికి' ఇదే నిదర్శనం అని విమర్శలు చేసింది.

#KTR#minister ponguleti srinivas reddy#ED raids#2years back#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి