సినిమా

The Paradise Teaser: కాకులు తల్వార్ పడితే..జడల్ జమానా షురూ

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ది ప్యారడైజ్'. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా సినిమాతో నానిని ఊర మాస్ అవతార్ లో చూపించి కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాను ఇచ్చాడు శ్రీకాంత్. ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాతో అంతకుమించి కల్ట్ రోల్ లో చూపించబోతున్నాడు. ఈ సినిమా మొదలైనప్పుడు వదిలిన గ్లింప్స్ లో ఉన్న డైలాగ్ కి అందరూ నెగిటివ్ గా కామెంట్స్ చేశారు.

కానీ, తాజాగా ఆ డైలాగ్ కి అర్థం ఏంటో హింట్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. అనగారితనానికి గురైన ఓ వర్గం నాయకుడు చేసేపోరాటమే ది ప్యారడైజ్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో, నాని లుక్ ఇప్పటి వరకూ చూడని ఓ వెరైటీ మేకోవర్‌తో ఉండటం ఆసక్తికరమైన విషయం. జడల్ అనే పాత్రలో నాని విశ్వరూపం టీజర్ లో జస్ట్ శాంపిల్ చూపించాడు.

"ఈ దేశం ఎవరిదీ".."ఈ జాగా ఎవరిదీ".. అంటూ నాని అరుపులకి గ్యారెంటీగా థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. నానిలో ఇలాంటి హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకూ చూడలేదు. పోస్టర్ దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ వచ్చిన టీజర్ వరకూ సినిమాపై అంచనాలను బాగా పెంచాడు శ్రీకాంత్ ఓదెల. ఇక, ఈ సినిమాలో నానికి జంటగా కయాదు లోహర్ నటించింది. స్పెషల్ సాంగ్‌లో కీర్తి సురేష్ కనిపించబోతోంది.

రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో ప్యారడైజ్ టీజర్ ఎలా ఉండబోతుంది అన్న మాటకి..శ్రీకాంత్ 'తగలబడుతుంది'..అని చెప్పడం అందరూ 'అబ్బా'.. అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు టీజర్ చూసిన వాళ్ళకి కొన్ని క్షణాలు నోట మాట రావడం లేదు. టీజరే ఇలా ఉంటే..ట్రైలర్ ఎలా ఉంటుంది..సినిమా ఇంకెలా ఉంటుందో.. అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 24న 7 భాషలలో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

#nani#theparadaise#theparadaiseteaser#kayadulohar#srikanthodela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి