National

Cockroach Janata Party: క్యా బోల్తీ పబ్లిక్.. సీజేపీ కొత్త క్యాంపెయిన్ ఇదే..

రచన: NK5 నిమిషాల పఠనం

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కాక్రోచ్ జనతా పార్టీ సఫలమైన సంగతి తెలిసిందే. దీంతో నెక్ట్స్ వారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ క్రమంలో తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటించింది సీజేపీ.

Cockroach Janata Party: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కాక్రోచ్ జనతా పార్టీ సఫలమైన సంగతి తెలిసిందే. దీంతో నెక్ట్స్ వారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ క్రమంలో తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటించింది సీజేపీ. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధమైంది. సెప్టెంబర్ నుండి "క్యా బోల్తీ పబ్లిక్" పేరుతో క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే తెలిపారు. దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌లో సీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే. తమ ఉద్యమం రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఉంటుందన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో సాగుతుందన్నారు. లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంపై తమ పార్టీ దృష్టి సారిస్తుందన్నారు. తాము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామని, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని దీప్కే వెల్లడించారు. తమ దేశవ్యాప్త పర్యటనలో దేశంలోని పరిస్థితులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామన్నారు.

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల దీప్కే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వంటి సంస్థల ప్రస్తుత తీరు ప్రజాస్వామ్యానికే ముప్పు కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారాయన. మన దేశంలో సంస్థాగత జవాబుదారీతనం ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాద సంకేతంగా అభివర్ణించారు. గతంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకునే వారు, కానీ నేడు ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తోందన్నారు. ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని సరిదిద్దాలన్నారు. అలా చేయనంత వరకు దేశంలో ఎన్నికల తారుమారు కొనసాగుతూనే ఉంటుందన్నారు.

జంతర్ మంతర్ నిరసన తర్వాత పార్టీ తదుపరి కార్యాచరణపై ప్రజల్లో నెలకొన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించినట్లు దీప్కే తెలిపారు. "నీట్ ఆందోళనల తర్వాత మేము ఏం చేయబోతున్నామంటూ చాలామంది సందేశాలు పంపుతూ, కామెంట్లు చేస్తూ అడుగుతుండటం నాకు సంతోషాన్నిస్తోంది. అందుకే మేము ఒక ప్రకటన చేస్తున్నాం. సెప్టెంబర్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం ప్రజల గురించి మాట్లాడటం అత్యవసరం. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. అలాగే వారి గొంతును వినాల్సిన సమయం ఇది. ఒకవేళ వారి మాట వినకపోతే, వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతారు" అని అభిజీత్ దీప్కే అన్నారు.

#Cockroach Janata Party#CJP#Kya Bolti Public#Abhijeet Dipke#Swechaa News#Nation Wide Campaign
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి