సినిమా

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్..అసలు మ్యాటరేంటంటే!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Chiranjeevi: ఈ మధ్య సోషల్ మీడియాలో సినీ తారల గురించి రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. డీప్ ఫేక్ ఫొటోస్, వీడియోస్‌తో ఇబ్బంది పడుతున్నవారూ ఉన్నారు. ఇప్పటికే, సమంత, మృణాల్ ఠాకూర్, శృతి హాసన్, కీర్తి సురేష్ సహా పలువురు హీరోయిన్స్ డీఫ్ ఫేక్ బారిన పడి పోలీసులకి ఫిర్యాదు చేసే వరకూ వెళ్ళారు.

Chiranjeevi: ఈ మధ్య సోషల్ మీడియాలో సినీ తారల గురించి రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. డీప్ ఫేక్ ఫొటోస్, వీడియోస్‌తో ఇబ్బంది పడుతున్నవారూ ఉన్నారు. ఇప్పటికే, సమంత, మృణాల్ ఠాకూర్, శృతి హాసన్, కీర్తి సురేష్ సహా పలువురు హీరోయిన్స్ డీఫ్ ఫేక్ బారిన పడి పోలీసులకి ఫిర్యాదు చేసే వరకూ వెళ్ళారు.

గతంలో, ఒకసారి చిరంజీవి కూడా తన అనుమతి లేకుండా.. నా ఫొటోలను గానీ, వీడియోలను గానీ, నెగిటివ్‌గా వార్తలను ప్రసారం చేయడం చేస్తే చర్యలు తీసుకోమని పోలీసులను ఆశ్రయించాడు. అయినా, కూడా తప్పుడు వార్తలకి అడ్డు అదుపు ఉండటం లేదు. గత రెండు రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ టీమ్ రెస్పాండ్ అవక తప్పలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని..అఫీషియల్‌గా మేము ఏ విషయాన్నైనా కన్‌ఫర్మ్ చేసే వరకూ ఇలాంటి నెగిటివ్ న్యూ స్ప్రెడ్ చేయవద్దని సోషల్ మీడియా హ్యాండిల్ (X) ద్వారా వెల్లడించారు. దీంతో, చిరంజీవి ఆంధ్రపదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతున్నారనే విషయం గాసిప్ రాయుళ్ళ పని అని తేలిపోయింది.

పూర్తిగా సినిమాలే:

మెగాస్టార్ పూర్తిగా కమిటైన సినిమాలపైనే దృష్టి పెట్టారు తప్ప..ఇంకే వ్యాపకాలపైన లేదు. ప్రస్తుతం, బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు చిరు. ప్రస్తుతం, ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక, దసరా వరకూ విశ్వంభర చిత్రం రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాబీ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంకో సినిమా చేయాల్సి ఉంది. నాని నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.

https://twitter.com/MegaStaroffl/status/2085287981213233594

#chiranjeevi#megastarchiranjeevi#chiru#megastar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి