తెలంగాణ

Kamalapur Sarpanch: బెల్ట్ షాపులపై చర్యలు ఏవి? అబ్కారీ శాఖ తీరుపై కమలాపూర్ సర్పంచ్ ఆగ్రహం

రచన: NK4 నిమిషాల పఠనం

అబ్కారీ శాఖ నిర్లక్ష్యపు పనితీరుపై కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, భీంపెళ్ళి సర్పంచ్ వాసాల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ కమలాపూర్ సర్పంచ్ నిరసన తెలిపారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని, అనేక కుటుంబాలు ఆగమవుతున్నాయని..

Kamalapur Sarpanch: అబ్కారీ శాఖ నిర్లక్ష్యపు పనితీరుపై కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, భీంపెళ్ళి సర్పంచ్ వాసాల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ కమలాపూర్ సర్పంచ్ నిరసన తెలిపారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని, అనేక కుటుంబాలు ఆగమవుతున్నాయని, బెల్ట్ షాపులు నిషేధించాలన్న మహిళల అభ్యర్థన మేరకు కమలాపూర్ లో బెల్ట్ షాపులు నిషేధిస్తూ తీర్మానం చేశామన్నారు.

అయితే కొందరు తీర్మానాన్ని ధిక్కరించి అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. దీనిపై అబ్కారీ పోలీసులకు అనేకసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు అరికట్టాల్సిన అబ్కారీ అధికారులే చోద్యం చూస్తూ బెల్ట్ షాపులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అబ్కారీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి షాపులను పూర్తిగా లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

కమలాపూర్ గ్రామ పంచాయతీ బెల్ట్ షాపుల నిషేధం తర్వాత మండలంలో అనేక గ్రామాలు బెల్ట్ షాపులో నిషేధిస్తూ తీర్మానం చేశాయని భీంపెళ్ళి సర్పంచ్ వాసాల శ్రీనివాస్ తెలిపారు. కమలాపూర్ మండలాన్ని ఆదర్శంగా తీసుకొని అనేక గ్రామ పంచాయతీలు బెల్ట్ షాపులు నిషేధిస్తూ తీర్మానం చేశాయన్నారు. విచ్చల విడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాల కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మామూళ్ల మత్తులో బెల్ట్ షాపులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అబ్కారీ అధికారులు బెల్ట్ షాపులను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే అన్ని పార్టీలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు.

#Kamalapur Sarpanch#Satish#Belt Shops#Liquor Shops#Excise Department#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి