Prashanth Neel: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియన్ సినిమా డ్రాగన్. ప్రస్తుతం, ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ అండ్ గ్రే కలర్ నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోంది.
కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా వైడ్‌గా ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు నీల్. ముఖ్యంగా, కన్నడ సినిమా రేంజ్ ఇదే అని చులకనగా మాట్లాడిన వాళ్ళకి ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ తో గట్టి సమాధానం చెప్పాడు. ముఖ్యంగా, యష్ కి కన్నడ రాకింగ్ స్టార్ అనే ఇమేజ్ ని పాన్ ఇండియా స్థాయిలో ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 అంతకుమించిన హిట్ ని సాధించింది.
ఇక, ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీ పార్ట్ 1 మొత్తం పాత్రల పరిచయానికే సరిపోయింది. పృథ్విరాజ్ సుకుమారన్, ప్రభాస్‌లపై వచ్చే సీన్స్, ప్రభాస్ ఎలివేషన్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళాయి. దాంతో, ఎన్టీఆర్ డ్రాగన్ మీద అంచనాలు పాన్ ఇండియా లెవల్ లో ఉన్నాయి. అయితే, యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు, బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ పాత్ర ఈ సినిమాకి పెద్ద ఎసెట్ కాబోతుందట.
ఎన్టీఆర్, అనిల్ కపూర్ కాంబోలో సీన్స్ అన్నీ డ్రాగన్‌కే హైలెట్ గా నిలవనున్నాయని చెప్తున్నారు. అనిమల్ సినిమాలో అనిల్ కపూర్ కనిపించే సీన్స్‌లో ఎంతో ఎమోషన్ ఉంటుంది. రణబీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతకు మించిన ఎమోషన్స్, ఇంటెన్‌సిటీ డ్రాగన్ లో ఉన్నాయని తెలుస్తోంది.
ఒక టాలీవుడ్ స్టార్, ఒక బాలీవుడ్ స్టార్ ని కలిపే సత్తా మన తెలుగు దర్శకులకుందని అనిమల్ మూవీతో సందీప్ రెడ్డి ఏ రేంజ్ లో ప్రూవ్ చేశాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు, ప్రశాంత్ నీల్ కూడా అదే చేస్తున్నాడు. ఒకప్పుడు బాలీవుడ్ నటులు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపించేవారు. కానీ, ఇప్పుడు మన దర్శకులు వారికి కొత్త లైఫ్ ని ఇస్తున్నారు.












