క్రైమ్

Crime : తమిళనాడు టు ఢిల్లీ.. రైలులో తల లేని మొండెం ట్రావెల్!(వైరల్)

రచన: Kumar3 నిమిషాల పఠనం

టెక్ యుగంలో నేరాలు కూడా అంతే వైలెంట్‌గా జరుగుతున్నాయి. అనంతరం నిందితులు చాలా స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. మర్డర్ చేసి బాడీని మాయం చేసేందుకు రకరకాల ఎత్తులు, పన్నాగాలు పన్నుతున్నారు.

టెక్ యుగంలో నేరాలు కూడా అంతే వైలెంట్‌గా జరుగుతున్నాయి. అనంతరం నిందితులు చాలా స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. మర్డర్ చేసి బాడీని మాయం చేసేందుకు రకరకాల ఎత్తులు, పన్నాగాలు పన్నుతున్నారు. బాడీని ముక్కలుగా చేయడం, సూట్ కేసుల్లో ఊరు దాటించడం, చెరువులు, నాలాల్లో పడవేయడం ఇలా చేయడం వలన చనిపోయింది ఎవరు? గుర్తుపట్టడం చాలా కష్టం. చనిపోయింది ఎవరో తెలిస్తే ఆ రూట్ కాస్ వెతికి నిందితుడిని పట్టుకోవడం సాధ్యం అవుతుంది.అందుకే నిందితుల వేసే స్కెచ్‌లకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

తాజాగా ఓ నిందితుడు డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కించి ఢిల్లీకి పంపాడు. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఓ ట్రాలీ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. జనరల్ బోగీలో ఉన్న ఆ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడం, రక్తపు మరకలు ఉండటంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.

జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆ బ్యాగ్‌ను పరిశీలించగా.. తల, కొన్ని శరీర భాగాలు లేని మృతదేహం లభ్యమైంది. బాడీ అవయవాలకు చుట్టిన పాలిథిన్‌ కవర్‌పై చెన్నైకు సంబంధించిన స్లిప్ ఉండటంతో.. ఆ బాడీ చెన్నైకి చెంది ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.

https://x.com/pulsenewsbreak/status/2085180808772682040?s=20

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జీఆర్‌పీ పోలీసులు ఆ ట్రాలీ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌లలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. ఆ బ్యాగ్ ఎవరు పెట్టారో కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్టు తెలుస్తోంది. చెన్నయ్ పోలీసుల సాయం కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

#deadbody#suitcase#chennai#delhi#tamilanadu express train#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి