రాజకీయాలు

BRS : ఏది పడితే అది వాగితే ఊరుకోను.. ఎవరినీ వదిలిపెట్టను : హరీశ్ రావు

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వర్షాలు కురవకుండా, అధికారపార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు తాను క్షుద్రపూజలు చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.

రాష్ట్రంలో వర్షాలు కురవకుండా, అధికారపార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు తాను క్షుద్రపూజలు చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో రాష్ట్రంలో వర్షాలు పడొద్దని, తాను క్షుద్రపూజలు చేశానని కాంగ్రెస్ నేతలు తనపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు.

రాజకీయాల్లో విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుందని పేర్కొన్నారు. ఏది పడిదే అది మాట్లాడుతాం.. బట్టకాల్చి మీదేస్తామంటే తాను ఊరుకునే రకం కాదని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరీశ్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు.గతంలో మంత్రి కొండా సురేఖ ఇలాగే నోటికొచ్చినట్టు మాట్లాడి నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. క్షుద్రపూజల చేస్తున్నానని ఇష్టానుసారంగా ఆరోపించిన కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ సూట్, పరువు నష్టం కేసు వేయబోతున్నట్టు వెల్లడించారు.

ఇప్పటికే నోటీసులు పంపినట్టు చెప్పారు. లీగల్ యాక్షన్‌కు ఇంకా 30 రోజుల టైం ఉందని వివరించారు. కాంగ్రెస్ తప్పిదాలు, స్కాములను ఎత్తిచూపుతున్న నేపథ్యంలోనే రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై బురద జల్లేందుకు, డైవర్షన్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ నేతలు తెరలేపారని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో మైనింగ్ స్కామ్, నాదర్‌గుల్ భూముల వ్యవహారం, గురుకుల టెండర్లలో అవినీతిని బయటపెట్టామనే కోపంతేనే ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

నీళ్లు లేక రైతాంగం అల్లాడుతుంటే.. దేవాదులలో 10 మోటార్లు ఉన్నా.. నేటికీ 4 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని ఆగ్రహంవ్యక్తంచేశారు. ప్రజాహక్కులు, రైతాంగం, విద్యార్థుల పక్షాల బీఆర్ఎస్ పార్టీ తరఫున తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని.. తగ్గేదేలేదని మాజీ మంత్రి స్పష్టంచేశారు.

#harish rao#BRS#congress#poltics#blackmagic
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి