తెలంగాణ

TG : మంత్రులు చెప్పిన వినని అధికారులు.. ఏం జరుగుతోంది?

రచన: Kumar4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఆదేశాలను కొందరు అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇదే తొలిసారి కాదు.. రాష్ట్రంలో పార్ట అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కొందరు మంత్రుల మాటలను పెడచెవిన పెట్టడం, ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఆదేశాలను కొందరు అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇదే తొలిసారి కాదు.. రాష్ట్రంలో పార్ట అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కొందరు మంత్రుల మాటలను పెడచెవిన పెట్టడం, ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్టు సమాచారం.ఎందుకంటే వాళ్లంతా ఒకే దగ్గర ఏళ్లుగా పాతుకుపోయినట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ .. ఆదేశాలను అధికారులను పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల అటవీ శాఖలో ఐదుగురు మంత్రుల సిఫారసు మేరకు మంత్రి కొండా సురేఖ కొంతమంది అధికారులకు డిప్యూటేషన్ మీద పోస్టింగ్ కల్పించారు. అయితే, అటవీశాఖలో కొత్త పీసీసీఎఫ్‌గా నియామకమైన అధికారి వినయ్ కుమార్.. మంత్రి ఆదేశాలను పక్కనబెడుతూ డిప్యూటేషన్ మీద విధులు నిర్వహిస్తున్న వారిందరినీ తిరిగి సొంత పోస్టింగులకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.డిప్యూటేషన్లు రద్దు చేయడంతో వారంతా సదరు మంత్రులు ఎవరైతే అటవీశాఖ మంత్రికి సిఫారసు చేశారో.. తిరిగి వారిని సంప్రదించగా.. వారంతా షాక్ అయినట్టు తెలిసింది.

అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పినా పట్టించుకోకుండా 25 మంది అధికారులు, సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు చేసిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) వినయ్ కుమార్‌పై మంత్రులు గరం అయినట్టు సమాచారం. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, సంజయ్ కోరినా పీసీసీఎఫ్ వినయ్ కుమార్ పట్టించుకోలేదని సమాచారం.

ఈ ఘటనకు ముందు స్థానిక పరిస్థితులు, కుటుంబ అవసరాల రీత్యా తమను మరో చోటకు లేదా మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపించాలని మంత్రులు, నాయకులను అటవీశాఖలోని 25 మంది అధికారులు రిక్వెస్టు చేసినట్టు తెలిసింది.గత PCCF సువర్ణ ఆమోదించిన డిప్యుటేషన్లను.. జూన్ 30న బాధ్యతలు స్వీకరించిన నూతన PCCF వినయ్ కుమార్ రద్దు చేయడంతో అంతా షాక్ అయ్యారు.

https://x.com/TeluguScribe/status/2085216273781428695?s=20

మంత్రులంతా సంబంధిత అటవీ శాఖ మంత్రిని మరల సంప్రదించగా.. ఫైల్ తీసుకుని రావాలని అధికారి వినయ్ కుమార్‌ను మంత్రి కొండా ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం కాస్త బయటకు రావడంతో మంత్రులు చెప్పినా అధికారి వినడం లేదంటే ఆయన వెనుకున్న వ్యక్తి ఎవరిని ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

#ministers orders#pccf officer#dont care#hyderbad#congress government
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి