AA23: అల్లు అర్జున్ రేంజ్ కి తగ్గ సినిమాలను ఎంచుకున్నాడు. పుష్ప సిరీస్ తో గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి రికార్డ్స్, అవార్డ్స్ సాధించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు, అల్లు అర్జున్ ఇంటర్నేషనల్. అందుకే, వరుసగా పాన్ వరల్డ్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవి కూడా ఇద్దరు తమిళ దర్శకులతో చేస్తుండటం హాట్ టాపిక్. ఇప్పటికే, అట్లీ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రాకా చిత్రాన్ని చేస్తున్నాడు.
ముంబైలో భారీ సెట్స్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అంతేకాదు, హాలీవుడ్ వీఎఫెక్స్ సంస్థకి ఈ సినిమా అప్పగించారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ భారీ స్థాయిలో వర్క్ చేస్తున్నారు. దీపిక పడుకొణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. పార్ట్ 1 లో దీపిక..పార్ట్ 2 లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారట. అలాగే, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారట. కానీ, వీరికి సంబందించిన కన్‌ఫర్మేషన్ లేదు.
ఇదిలా ఉంటే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 23వ సినిమాను చేస్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అయితే, అటు ముంబై మీడియాలో ఇటు కోలీవుడ్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ 23వ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ని లోకేష్ ఫిక్స్ చేశాడట. ఇది ఇప్పుడు మీడియా వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
లోకేష్ సినిమాలలో విలన్ రోల్స్ కి క్రేజీ స్టార్స్ ని తీసుకుంటాడు. హీరోకి తగ్గ విలన్ సినిమాలో కనిపిస్తాడు. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి, విక్రమ్ మూవీలో సూర్య , లియోలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, కూలీలో టాలీవుడ్ స్టార్ నాగార్జున వంటి వారు నటించారు. కాబట్టి, ఇప్పుడు అల్లు అర్జున్ 23వ సినిమాలో షాహిద్ ని లోకేష్ కన్‌ఫర్మ్ చేసినా ఆశ్చర్యం లేదు. మరి, దీనికి అఫీషియల్ అప్‌డేట్ లోకేష్ ఎప్పుడిస్తాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.












