సినిమా

RC 17: రామ్ చరణ్ కి జోడీగా డ్రాగన్ బ్యూటీ?

రచన: Anshu4 నిమిషాల పఠనం

RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న తన 17వ సినిమాకి సంబందినంచిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ వర్క్ ఓ కొలిక్కి రావడంతో, ఇప్పుడు టెక్నికల్ టీమ్ అలాగే, నటీనటుల ఎంపిక జరుగుతోందట. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ మూవీలో ఎన్‌టిర్ సరసన నటిస్తోన్న క్రేజీ బ్యూటీని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇటీవలే రామ్ చరణ్ పెద్ది సినిమాతో వచ్చి తన ఊర మాస్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. క్రీడా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, వన్ మ్యాన్ షోగా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు మంచి కథ ఎంచుకొని, మేకింగ్ పరంగా బాగా డీల్ చేసినప్పటికీ.. కథా నేపథ్యం తేడా కొట్టింది. కొన్ని సన్నివేశాలలో చరణ్‌ని మెగా అభిమానులే చూడలేకపోయారు. దీంతో, అనుకున్న..ఆశించిన విజయం అందుకోలేదనే చెప్పాలి. జాన్వీ కపూర్ కూడా సినిమాకి కలిసి రాలేదు.

ఈ క్రమంలో, సుకుమార్ దర్శకత్వంలో మరోసారి భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు చరణ్. రంగస్థలం చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి సుకుమార్, చరణ్‌లతో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం చరణ్ సరసన కాంతార, డ్రాగన్ బ్యూటీ రుక్మిణి వసంత్ ని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడలోనూ రుక్మిణి కి మంచి క్రేక్ అండ్ ఫాలోయింగ్ ఉంది. కాంతార 1లో ఆమె పర్ఫార్మెన్స్‌కి ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు. దాంతో, ప్రశాంత్ నీల్..ఎన్‌టిర్ సరసన డ్రాగన్ సినిమా కోసం ఎంపిక చేశాడు. ఇప్పుడు, చరణ్ కి జంటగా కూడా ఈ బ్యూటీనే సుక్కూ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతానికైతే ఆర్సీ 17 కోసం హీరోయిన్‌గా ఈ కన్నడ భామనే ఫస్ట్ ఛాయిస్‌గా ఉంది. మరి, తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

#rc17#ramcharan#sukumar#rukminivasanth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి