వైరల్ న్యూస్

Viral video: వారెవ్వా.. పంచెకట్టులో స్పైడర్ మాన్, పట్టుచీరలో ఎంజే..!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్, ఎంజేల ప్రేమకథకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఊహించని మలుపు తిప్పింది. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' చిత్ర ముగింపులో పీటర్ పార్కర్, ఎంజే విడిపోవడం చూసి తీవ్ర నిరాశకు గురైన అభిమానుల ఆశలను నెరవేరుస్తూ ఒక నెటిజన్ సృష్టించిన ఏఐ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న స్పైడర్ మ్యాన్, ఎంజేల ప్రేమకథకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఊహించని మలుపు తిప్పింది. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' చిత్ర ముగింపులో పీటర్ పార్కర్, ఎంజే విడిపోవడం చూసి తీవ్ర నిరాశకు గురైన అభిమానుల ఆశలను నెరవేరుస్తూ ఒక నెటిజన్ సృష్టించిన ఏఐ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

సినీ ప్రియులంతా ఎంతో కాలంగా కలలుగంటున్న ఈ జంట వివాహ వేడుకను పూర్తి దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో డిజిటల్ రూపంలో ఆవిష్కరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వినూత్న పెళ్లి వేడుకలో పీటర్ పార్కర్ పాత్రధారి టామ్ హాలండ్ తెలుపు రంగు సంప్రదాయ పట్టు పంచెకట్టులో కనిపిస్తుండగా, ఎంజేగా మెరిసిన జెండయా ముత్యాల ఆభరణాలు, తలలో మల్లెపూలు, పట్టుచీర ధరించి అచ్చమైన దక్షిణాది వధువులా ముచ్చటగా ఉంది.

మంగళవాయిద్యాల దివ్య సమక్షంలో, ఒక ప్రాచీన ఆలయ ప్రాంగణంలో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సన్నివేశాలను ఏఐ సాంకేతికత సాయంతో ఎంతో సజీవంగా, కనులవిందుగా తీర్చిదిద్దడం విశేషం. ఈ పెళ్లి వేడుకకు కేవలం వరుడు, వధువులనే కాకుండా మిగిలిన అవెంజర్స్ సూపర్ హీరోలను కూడా ఏఐ ద్వారా అత్యంత ఆసక్తికరంగా రంగంలోకి దించారు. అంతేకాదండోయ్.. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, డాక్టర్ స్ట్రేంజ్ వంటి దిగ్గజ పాత్రలు ఈ కల్యాణానికి ప్రత్యేక అతిథులుగా రావడం విశేషం.

పాత తరం స్పైడర్ మ్యాన్లు టోబీ మాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నట్లు రూపొందించారు. అందరికంటే ముఖ్యంగా ఎక్స్-మెన్ క్యారెక్టర్ 'వుల్వరైన్' భోజనాల వద్ద అరటి ఆకుల్లో సంప్రదాయ పదార్థాలను వడ్డిస్తున్న దృశ్యాలు నెటిజన్లలో నవ్వులు పూయిస్తున్నాయి. సినిమా కథకు ఈ ఏఐ వీడియో ఒక పరిపూర్ణమైన తీపి ముగింపుని ఇచ్చిందని మార్వెల్ అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఊహాజనిత పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.

https://www.instagram.com/reel/DbpgXNNP401/?utm_source=ig_web_button_share_sheet

#Spider-Man#Peter Parker#MJ#AI Wedding#Marvel Avengers#Viral Video#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి