Sreeleela: వరుసగా సినిమాలు చేసినా శ్రీలీలకి హిట్స్ మాత్రం దక్కలేదు. అరడజను సినిమాలకి పైగా ఫ్లాపులొచ్చినా అవకాశాలు దక్కించుకుంది అంటే ఈ విషయంలో శ్రీలీల లక్కీ అనే చెప్పాలి. మన ఇండస్ట్రీలో రెండు ఫ్లాపులొస్తేనే పక్కన పెట్టేస్తారు. కానీ, ఇంకా ఈ డాన్సింగ్ క్వీన్ కి ఆవఫర్స్ రావడం అదృష్టం. అలాంటి, అదృష్టం మళ్ళీ తలుపు తట్టిందని కోలీవుడ్ మీడియాలో తాజా వార్త చక్కర్లు కొడుతోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో, జైలర్ 2 రాబోతోంది. అలాగే, మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇందులో, ఒకటి కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా. ధర్మాన్ పేరుతో ఇది రూపొందుతోంది. ఇది, కాకుండా కమల్ మరో సినిమాను రజినీతో నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే, ఇది కాస్త నమ్మడానికి కష్టమే. ఎందుకంటే, రజినీకాంత్ లాంటి సూపర్ సీనియర్ హీరోకి శ్రీలీల లాంటి టూ యంగ్ బ్యూటీ హీరోయిన్ అంటే అసలు.. ఆ ఇమాజినేషనే బాగోలేదు. కానీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కొన్ని ఇంతకముందు సినిమాలలో వర్కౌట్ అయ్యాయి. అలాంటి మ్యాజిక్ ఏదైనా ఉండొచ్చునని అంటున్నారు. ఏది, ఏమైనా రజినీ సినిమాలో శ్రీలీలకి ఛాన్స్ అంటే అది, నిజమైతే గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి. మరి, దీనికి సంబందించిన కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇక, ఇప్పటికే..తమిళంలో చేసిన పరాశక్తి డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న ఓం మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. రజినీ సినిమాతో పాటు ధనుష్ సినిమా కూడా హిట్ కొడితే కనీసం తమిళంలోనైనా శ్రీలీల నిలదొక్కుకుంటుంది. ఇక, సినిమాల విషయం ఎలా ఉన్నా కమర్షియల్ యాడ్ ఫిలింస్ మాత్రం విరివిగా చేస్తోంది. అక్కడ, మాత్రం అమ్మడు చాలా బిజీ. ఇంకోపక్క తల్లితో కలిసి దైవ దర్శనాలలో బిజీగానూ ఉంది.












