National

CJP: 'బొద్దింక పార్టీ' జాతీయ నాయకత్వంలో హైదరాబాద్ యువకుడికి చోటు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌కు చెందిన యువ సామాజిక కార్యకర్త విజయ్‌రెడ్డి మల్లంగి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ మీడియా సమన్వయకర్తగా, అలాగే దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జిగా ఆయన నియమితులయ్యారు. గురువారం నాడు సీజేపీ ప్రకటించిన తొలి జాతీయ నాయకత్వ బృందంలో ఒక తెలుగు యువకుడికి చోటు దక్కడం విశేషంగా నిలిచింది. ప్రజా సమస్యలపై పోరాడే ఈ వేదికలో ఆయనకు ప్రాధాన్యత లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన విజయ్‌రెడ్డి, ఇక్కడే తన ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, కొలంబియా యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత అక్కడే మూడేళ్ల పాటు ప్రతిష్టాత్మక ఉద్యోగం చేశారు. అయినప్పటికీ, సమాజానికి సేవ చేయాలనే బలమైన ఆకాంక్షతో తన ఉద్యోగాన్ని, విదేశీ జీవితాన్ని వదిలిపెట్టి సొంత నగరమైన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. నాటి నుంచి సామాజిక అంశాలపై నిరంతరం దృష్టి సారిస్తూ వస్తున్నారు.

విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న విజయ్‌రెడ్డి, 'సేవ్ కేబీఆర్', 'కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ' వంటి స్థానిక పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో 45రోజుల పాటు సాగిన నిరసనల్లో ఆయనకు సహాయకుడిగా, కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆ సమయంలో విజయ్‌రెడ్డి చూపిన అంకితభావం, నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించిన సీజేపీ ప్రతినిధులు ఆయనకు జాతీయ కమిటీలో ఈ బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా విజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీజేపీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, స్థానిక సమస్యలపై పార్టీలకతీతంగా పోరాడే ఉద్యమ వేదిక అని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీజేపీని బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సమస్యలను బలంగా వినిపించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

#VijayReddyMallangi#CockroachJanataParty#CJPNationalMediaCoordinator#HyderabadNews#SonamWangchuk#TelanganaSocialActivist#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి