మహిళా హోంగార్డుకు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.ఇంట్లో పనులు, బయట పనులు, తాము చెప్పిన పని చేయాల్సిందేనని లేదంటే జాబ్ నుంచి తొలగిస్తామంటూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది.అనారోగ్య సమస్యల కారణంగా తనకు స్టేషన్ పని అప్పగించాలని కోరినా ఉన్నతాధికారులు వినిపించుకోకుండా తనను సస్పెండ్ చేశారని ఓ బాధిత మహిళా హోంగార్డు ఆరోపించింది.
వివరాల్లోకివెళితే.. కృష్ణా జిల్లా పెనమలూరులో మహిళా హోంగార్డు రూపకళ పట్ల ఉన్నతాధికారులు దురుసుగా ప్రవర్తించినట్టు ఆమె మీడియాకు వివరించారు. సదరు బాధితురాలి భర్త చనిపోవడంతో ఆమెకు హోంగార్డు ఉద్యోగం వచ్చింది.అయితే, ఉన్నతాధికారుల ఇంట్లో పని చేయాలంటూ ఆమెపై అధికారులు ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అందుకు ఆమె నిరాకరించడంతో పనిష్మెంట్ కింద వారం రోజులు ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు పై అధికారులు..
https://x.com/pulsenewsbreak/status/2085380241342816563?s=20
అక్కడ ప్రతిరోజూ తన చేత గడ్డి పీకించారంటూ రూపకళ మీడియాతో ఆవేదన వ్యక్తంచేసింది. తన గోడు వినిపించేందుకు ఎస్పీని కలిస్తే.. ఆయన కూడా దురుసుగా ప్రవర్తించాడని.. ‘నీకు ఉద్యోగం ఇచ్చింది స్టేషన్‌లో కూర్చోవడానికి కాదు.. ఉన్నతాధికారుల ఇళ్లల్లో పని చేయాలని’ అవహేళన చేశారంటూ వాపోయింది. ఆరోగ్యం సహకరించడం లేదని చెబితే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుందని తనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని పేర్కొంది. ఇప్పుడు మరల పోస్టింగ్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని మహిళా హోంగార్డు కన్నీరు మున్నీరైంది.












