National

Congress : రాహుల్ గాంధీకి షాకిచ్చిన సాధువులు..

రచన: Kumar3 నిమిషాల పఠనం

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి బిగ్‌షాక్ తలిగింది. ఢిల్లీలోని ఆయన ఉంటున్న నివాసాన్ని పలువురు ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గేట్లు మూసివేయగా.. అక్కడే ఆందోళన కారులు, సాధువులు నిరసనలు తెలిపారు.

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి బిగ్‌షాక్ తలిగింది. ఢిల్లీలోని ఆయన ఉంటున్న నివాసాన్ని పలువురు ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గేట్లు మూసివేయగా.. అక్కడే ఆందోళన కారులు, సాధువులు నిరసనలు తెలిపారు.అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.

గత యాభై ఏండ్లుగా తాము కాంగ్రెస్ పార్టీ కోసం రక్తం, చెమట చిందించి కష్టపడి పనిచేస్తే ఇప్పుడు తమను బయటకు గెంటేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైఖరి సిగ్గుచేటు అంటూ ఓ నిరసనకారుడు ఆందోళన వ్యక్తంచేశాడు.అయితే, సాధువులు అక్కడకు ఎందుకు వచ్చారనే విషయం తెలియాల్సి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తీరుతో తమకు నష్టం వాటిల్లిందని నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగినట్టు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.రాహుల్ ఇంటి ముట్టడికి యత్నించిన సాధువులతో సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ నివాసం వద్ద అదనపు బలగాలను మోహరించి భద్రతను పటిష్టం చేశారు. ఆందోళనకారుల డిమాండ్లు ఏంటి? వారు ఎందుకు నిరసనకు దిగారు? సమాచారం లేకుండా లోక్‌సభ ప్రతిపక్ష నేత ఇంటి ముట్టడికి యత్నించడం వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

#Rahul gandi home#protests#delhi#arrest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి