International

Meta : చైల్డ్ సెక్సువల్ కంటెంట్.. ‘మెటా’కు రూ.4,700 కోట్ల భారీ జరిమానా?

రచన: Kumar4 నిమిషాల పఠనం

సోషల్ మీడియా టైకూన్ ‘మెటా’కు ప్రపంచవ్యాప్తంగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మెటా అనుబంధంగా నడుస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో చైల్డ్ సెక్సువల్ కంటెంట్, యువతను మానసికంగా దెబ్బతీసే కంటెంట్ రాకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రెండ్రోజుల కిందట భారత ప్రభుత్వం మెటా ప్రతినిధులను పిలిపించి వార్నింగ్ ఇచ్చింది.

సోషల్ మీడియా టైకూన్ ‘మెటా’కు ప్రపంచవ్యాప్తంగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మెటా అనుబంధంగా నడుస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో చైల్డ్ సెక్సువల్ కంటెంట్, యువతను మానసికంగా దెబ్బతీసే కంటెంట్ రాకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రెండ్రోజుల కిందట భారత ప్రభుత్వం మెటా ప్రతినిధులను పిలిపించి వార్నింగ్ ఇచ్చింది.అమెరికా నుంచి సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సైతం కేంద్రాన్ని క్షమాపణలు కోరారు. తప్పు జరిగిందని అంగీకరించారు.ఇకమీదట చైల్డ్ సెక్సువల్ కంటెంట్ ప్రసారం జరిగితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది.

ఇదిలాఉండగా పిల్లలు, టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించడంతో పాటు వారి భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు ‘మెటా’కు 567 మిలియన్ డాలర్లు అనగా.. భారత కరెన్సీలో సుమారు రూ.4,700 కోట్లకు పైగా భారీ జరిమానా విధిస్తూ ‘న్యూ మెక్సికో’ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసు విచారణ రెండు దశల్లో సాగింది. ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్ పిల్లల మానసిక ఆరోగ్యానికి కలిగించే హానికరమైన కంటెంట్‌ను దాచిపెడుతోందని..వినియోగదారులను మోసం చేసిందని

నిర్దారణకు వచ్చిన మెక్సికో కోర్టు జ్యూరీ మార్చిలోనే మెటాపై 375 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3,100 కోట్ల జరిమానా విధించింది. తాజాగా న్యాయమూర్తి బ్రయాన్ బీడ్‌షీడ్ ఇచ్చిన ఉత్తర్వులతో అదనంగా మరో 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఈ ఒక్క కేసులోనే 942 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.7,800 కోట్లు మెటా చెల్లించాల్సి ఉంది.

కోర్టు ఆదేశాల ప్రకారం, ఆ జరిమానా సొమ్ములో 420 మిలియన్ డాలర్లు సోషల్ మీడియా అడిక్షన్, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువత చికిత్స నిమిత్తం ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది.కాగా, న్యూ మెక్సికో కోర్టు తీర్పుపై ‘మెటా’ ప్రతినిధులు స్పందించారు. హైకోర్టులో సవాల్ చేస్తామని పేర్కొన్నారు.

#Meta#child#teenage abuse content#international#socialmedia
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి