సినిమా

Surender Reddy: పవన్ తో సినిమా ఉన్నట్టా లేనట్టా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Surender Reddy: దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు చెప్తే ఆయన తీసిన స్టైలిష్ బ్లాక్ బస్టర్స్ గుర్తొస్తాయి. అతనొక్కడే, రేసుగుర్రం, కిక్, ఊసరవెల్లి, అశోక్, ధృవ, సైరా నరసింహారెడ్డి..ఇవన్నీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినవే. అలాగని, అన్నీ బ్లాక్ బస్టర్స్ తీశాడనుకోవడానికీ లేదు. కిక్ 2, అతిథి, ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ కూడా తీశాడు. ఏజెంట్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ కొత్త సినిమా కబుర్లేవీ చెప్పలేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి ఎప్పుడో సినిమాను ప్రకటించాడు. ఏళ్ళు గడుస్తున్నా..ఈ సినిమా ఓ కొలిక్కి రావడం లేదు. సురేందర్ రెడ్డి తర్వాత పవన్ తో గ్రీన్ సిగ్నల్ తెచ్చుకొని నాలుగైదు సినిమాలు తీస్న దర్శకులున్నారు. కానీ, సురేందర్ రెడ్డి ప్రకటించిన పవన్ సినిమా మాత్రం అడ్రస్ లేదు.

పవన్ కళ్యాణ్ తో సినిమాను ప్రకటించాకే, అఖిల్ తో ఏజెంట్ మూవీని ప్రకటించడం, తీయడం, ఘోర పరాజయాన్ని చూడటం జరిగిపోయాయి. ఓజీ తర్వాత మళ్ళీ, సురేందర్ రెడ్డి తో సినిమా ఉంటుందని ఒక పోస్టర్ వదిలి చెప్పారు. కానీ, ఇంకా ఈ సినిమాకి సంబందించిన కథ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఓకే చేయలేదని తెలుస్తోంది. ఆల్రెడీ కథ విన్న పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డికి మార్పులు చేర్పులు చెప్పాడట.

ఇంకా, కథ వండే స్టేజ్‌లోనే ఉంది. తాజా, సమాచారం మేరకు ఇప్పట్లో, పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి సినిమా ఉండే అవకాశాలు లేవంటున్నారు. ప్రస్తుతం, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్..వచ్చే ఏడాది ఓజీ 2 చేయనున్నాడు. ఈ సినిమా అయ్యాకే సురేందర్ రెడ్డితో సినిమా చేస్తాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. దీనిపై, స్వయంగా సురేందర్ రెడ్డి క్లారిటీ ఇస్తే గానీ అన్నీ విషయాలలో స్పష్టత వస్తుంది.

#pawankalyan#sureanderreddy#tollywood#latestmovieupdates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి