టాప్ న్యూస్

Breaking : రెండో ఖాతా తెరిచిన అధికార ఎమ్మెల్యే.. అయ్యో అలా ఎలా దొరికిపోయావ్!

రచన: Kumar4 నిమిషాల పఠనం

అధికార కాంగ్రెస్‌లో లేటు వయసులో ఓ ఎమ్మెల్యే వెలగబెట్టిన యవ్వారం ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. దక్షిణ తెలంగాణ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత.. రెండో ఖాతా తెరిచినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్య బయటపెట్టినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఆయన దక్షిణ తెలంగాణ లోని ఓ నియోజకవర్గం నుండి పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయినట్టు సమాచారం. ఎమ్మెల్యే మీద మనసు పడిన ఓ పడతితో ఆయన ప్రేమలో పడినట్టు సమాచారం. ఈ వ్యవహారం చాలా కాలం నుంచే గుట్టుగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో నెల నెల తనకు ఖర్చుల కోసం డబ్బులు పంపించాలని ప్రియురాలు షరతు పెట్టినట్టు సమాచారం.

దీంతో సదరు ప్రజాప్రతినిధి నెలకు రూ.లక్ష చొప్పున బ్యాంక్ నుంచి తన ప్రియురాలికి ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చాడు. ఇంతలో ఆయన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ చూసిన ఎమ్మెల్యే గారి సతీమణి మదిలో ఓ అనుమానం కలిగింది. ఠంఛన్‌గా ప్రతినెలా రూ.లక్ష బదిలీ అవుతున్న విషయాన్ని ఆమె గుర్తించడంతో పాటు ఎవరిది ఈ అకౌంట్ అని ఆరా తీసింది. దీంతో అయ్యగారు కొత్త అకౌంట్ తెరిచిన విషయం బయటపడటంతో ఇన్నాళ్లు గుట్టుగా సాగిన ప్రేమవ్యవహారం లీక్ అయ్యింది.

బ్యాంకు అకౌంట్ ద్వారా ప్రేమ వ్యవహారం బయటపడేసరికి కొత్త ఎమ్మెల్యే సారు ఖంగు తినాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ టాపిక్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉదంతం మరువకముందే మరో ఎమ్మెల్యే ప్రేమాయణం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

https://x.com/TeluguScribe/status/2085618289015734700?s=20

#love affair#congress mla#south telangana#new account#viral
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి