తెలంగాణ

Breaking : కాంట్రాక్టర్లకు బెదిరింపులు.. మంత్రి పేరిట విద్యాశాఖ ఇంజినీర్ దందా!

రచన: Kumar3 నిమిషాల పఠనం

మంత్రి పేరు చెబుతూ ఓ విద్యాశాఖ ఇంజినీర్ కాంట్రాక్టుల దందా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తన బినామీ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు, మిగతా కాంట్రాక్టర్లను పోటీ నుండి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రి పేరు చెబుతూ ఓ విద్యాశాఖ ఇంజినీర్ కాంట్రాక్టుల దందా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తన బినామీ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు, మిగతా కాంట్రాక్టర్లను పోటీ నుండి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ప్రహరీ నిర్మించే పనికోసం రూ.3.73 కోట్లతో అధికారులు టెండర్లు పిలిచారు.అయితే, ఆ టెండర్‌లో ఆరు కంపెనీలు పోటీ పడగా ఓ కంపెనీకి అర్హత లేదని తప్పించారు.

ఈ క్రమంలోనే మిగతా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి దరఖాస్తు వెనక్కి తీసుకోవాలని ఓ విద్యాశాఖ ఇంజినీర్ బెదిరిస్తున్నట్టు సమాచారం. అయితే,తాను 2% తక్కువకు టెండర్ వేశానని, దరఖాస్తు వెనక్కి తీసుకోనని ఓ కాంట్రాక్టర్ తెలపగా, సదరు ఇంజినీర్ మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది. అయితే, మంత్రి సూచన మేరకు పోటీ తప్పుకోవాలని ఓ లేఖ ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ కోరగా.. ఆఫీసుకు వస్తే వివరాలు చెప్తానని సదరు ఇంజినీర్ చెప్పినట్టు సమాచారం.

అయితే, టెండర్ వేసిన సంస్థల్లో ఒకటి సదరు ఇంజినీర్‌కు బినామీ కంపెనీ అని, ఆ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించేందుకే మిగతా కాంట్రాక్టర్లను విద్యాశాఖ ఇంజినీర్ బెదిరిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.దీనిపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ ఇంజినీర్ వెనుకున్న మంత్రి ఎవరు? అని కూడా చర్చ జరుగుతోంది.

https://x.com/TeluguScribe/status/2085623835857203656?s=20

#education department#enjineer#contract#warnings#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి