National

Vandematram: పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా మూడేళ్లు జైలు.. వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

రచన: NK5 నిమిషాల పఠనం

వందేమాతరం బిల్లుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటులో పాస్ అయిన వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వందేమాతరం గేయానికి చట్టబద్ధత లభించింది. ఇకపై ఎవరైనా వందేమాతరం గేయాన్ని అవమానించినా, పాడుతుండగా అడ్డుకున్నా, పాడుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించినా నేరంగా పరిగణిస్తారు. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. అలాగే జరిమానా విధించే అవకాశమూ ఉంది.

Vandematram: వందేమాతరం బిల్లుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటులో పాస్ అయిన వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వందేమాతరం గేయానికి చట్టబద్ధత లభించింది. ఇకపై ఎవరైనా వందేమాతరం గేయాన్ని అవమానించినా, పాడుతుండగా అడ్డుకున్నా, పాడుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించినా నేరంగా పరిగణిస్తారు. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. అలాగే జరిమానా విధించే అవకాశమూ ఉంది. జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం కూడా ఉంది. అంతకుముందున్న చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేవలం జాతీయ గీతానికి ఈ రక్షణలు ఉండేవి. ప్రస్తుతం వందేమాతరం గేయానికీ ఇవే రక్షణలు కల్పిస్తూ చట్టంలో మార్పులు చేసింది కేంద్రం.

జాతీయ గీతం జనగణమన తరహాలోనే వందేమాతరం గేయానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026 తీసుకొచ్చింది. జాతీయ గేయాన్ని అవమానించడాన్ని నేరంగా గుర్తించేలా 1971 నాటి చట్టానికి కేంద్రం తాజాగా మార్పులు చేసింది. జాతీయ గీతం (నేషనల్ సాంగ్) జనగణమనకు సమాన హోదాను వందేమాతరం గేయానికి కల్పించేందుకు కేంద్రం ఈ చట్టం తెచ్చింది. కొత్త చట్టంతో వందేమాతరం గేయాన్ని పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా నేరంగా పరిగణిస్తారు.

ఈ ఏడాది ప్రారంభంలో, అధికారిక కార్యక్రమాలు పాఠశాలల్లో జాతీయ గీతంతో పాటు 'వందేమాతరం'లోని మొత్తం ఆరు చరణాలను తప్పనిసరిగా ఆలపించాలని లేదా ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. 'వందేమాతరం'లోని కొన్ని చరణాలు దేవీదేవతల స్తుతిని కలిగి ఉండటంతో ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది.

కేంద్రం విధించిన నిబంధనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే, 'వందేమాతరం' పాడకపోతే ఎటువంటి శిక్ష విధింపు లేదని చెబుతూ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. పాఠశాలల్లో 'వందేమాతరం'లోని అన్ని చరణాలను పాడటం తప్పనిసరి అని కేంద్ర హోం శాఖ (MHA) సర్క్యులర్ పేర్కొనలేదని గమనించిన కర్ణాటక హైకోర్టు కూడా, ఇదే తరహా పిటిషన్‌ను పరిష్కరిస్తూ కొట్టివేసింది. కలకత్తా హైకోర్టు కూడా ఇలాంటిదే ఒక పిటిషన్‌ను విచారించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన విచారణ సందర్భంగా.. మదర్సాలలో ఆ పాటను పూర్తిగా పాడినంత మాత్రాన ఆకాశం ఏమీ ఊడిపడదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

#Vandematram#Vandematram National Honour Amendment Act#Droupadi Murmu#President#Grants Assent#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి