సినిమా

Srikanth Odela: ది ప్యారడైజ్ టీజర్ పై నెగిటివ్ కామెంట్స్..ఆ లోపాలేంటంటే

రచన: Anshu3 నిమిషాల పఠనం

Srikanth Odela: వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకి సెప్టెంబర్ 24న 7 భాషలలో ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఎందుకింత ఆలస్యం అయిందో నిన్న వచ్చిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. భారీ యాక్షన్ సీన్స్ కోసం చాలా సమయం తీసుకున్నారు. నాని కెరీర్ లో మొదటిసారి ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ చేశాడు.

Srikanth Odela: వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకి సెప్టెంబర్ 24న 7 భాషలలో ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఎందుకింత ఆలస్యం అయిందో నిన్న వచ్చిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. భారీ యాక్షన్ సీన్స్ కోసం చాలా సమయం తీసుకున్నారు. నాని కెరీర్ లో మొదటిసారి ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ చేశాడు.

దసరా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఇక, ఈ సినిమాలో నానికి జంటగా కయాదు లోహర్ నటించింది. ఆమె కనిపించిన సెకండ్స్ కొన్నే అయినా ఆర్ట్ సినిమా హీరోయిన్‌లా ఎంతో క్లాసీగా ఉంది. ఊర మాస్ అవతార లో జడల్ గా నటించిన నాని, కయాదు లోహర్ ల మధ్య జర్నీ ఎలా మొదలవుతుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక, టీజర్ వచ్చాక ఎంత హైప్ క్రియేట్ అయిందో..అంత నెగిటివిటీ కూడా వచ్చింది. అసలు, ఇందులో డైలాగ్స్ గమ్మున ఎవరికీ అర్థం కావడం లేదు. సౌండ్ ప్రాబ్లం చాలా ఉంది. ఇది, ఒకరకంగా ఇద్దరి పొరపాటు అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అయితే, రెండవది దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ది. వీరు, టీజర్ కట్ చేసినప్పుడు సౌండ్ చూసుకోలేదా..ఎంత స్పీడ్‌గా చెప్పిన డైలాగ్స్ ఎలా అర్థమవుతాయి అని ఆలోచించలేదా?

ఇదే, టీజర్ కట్ చూశాక వినిపించిన మాటలు. సినిమాలో ఇలాగే ఉంటే ప్రేక్షకులు విసిగిపోక తప్పదు. మరి, రీ రికార్డింగ్ లో నైనా సౌడ్ అండ్ డైలాగ్ డెలివరీకి సంబందించిన పొరపాట్లను సరిదిద్దుకుంటారా..ఈ పొరపాట్లు కరెక్ట్ చేస్తేనే ప్యారడైజ్ సినిమా జనాలకి అర్థమవుతుంది. లేదంటే ఏం తీశారో ఏం చూశామో.. అని నిరుత్సాహంగా ప్రేక్షకులు బయటకు రాక తప్పదు. చూడాలి, మరి ఈ ఫీడ్ బ్యాక్ తెలుసుకొని మేకర్స్ ఫైనల్ అవుట్‌పుట్ ఎలా రెడీ చేస్తారో.

#srikanthodela#nani#theparadaise#kayadulohar#mohanbabu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి