Ritika Nayak: కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన హీరోయిన్ గనక గోల్డెన్ లెగ్ అనిపించుకుంటే నిర్మాతలే కాదు, దర్శకులు..హీరోలు ఆమె వెనకాలే క్యూ కడతారు. ఎప్పటికప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి కొత్త అమ్మాయిలు వస్తున్నా, వారిలో సక్సెస్ ట్రాక్ ఎక్కి.. మేకర్స్ ని ఆకర్షించేది వేళ్ళపై లెక్కపెట్టేంతమందే. మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత సెంటిమెంట్స్ ఇంకోచోట ఉండవంటారు.
ఇది, మిగతావాళ్ల విషయంలో ఏమోగానీ, హీరోయిన్ విషయంలో మాత్రం బాగా పాటిస్తారు. ఈ హీరోయిన్ ని పెట్టుకుంటే మన సినిమా హిట్ అని..అబ్బే ఈ అమ్మాయి వల్లే సినిమా ఫ్లాపైందనీ మాట్లాడుతుంటారు. అందుకే, కొత్త అమ్మాయిలు 10 మంది వస్తే, వారిలో ఒకరో ఇద్దరో నిలబడుతున్నారు. గత పదేళ్లలో ఎంతమంది వచ్చారో లెక్కే లేదు.
ఉప్పెన తర్వాత కృతిశెట్టి..పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఒక ఊపు ఊపేశారు. ఏ సినిమాలో చూసినా హీరోయిన్‌గా వీళ్ళే. కానీ, ఆ ఊపు ఎంతోకాలం ఉండలేదు. ఇద్దరికీ ఎలా అయితే వరుసగా ఆఫర్స్ వచ్చాయో..అలా ఫ్లాప్స్ కూడా వచ్చాయి. దాంతో, ఇప్పుడు ఇండస్ట్రీ కొత్త భామల కోసం చూస్తోంది. ఇప్పుడు, అందరి దృష్టి భాగ్యశ్రీబోర్సే, రితిక నాయక్ మీదే ఉంది.
ముఖ్యంగా, రితిక నాయక్ ని లక్కీ లెగ్ అని చెప్పుకుంటున్నారు. మిరాయ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో తన లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయని కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు, మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. తాజాగా, ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కియా కార్ షో రూమ్ లో వర్క్ చేసే అమ్మాయిగా నటించింది.
స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరకడంతో పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఎక్కువ దొరికింది. దీంతో, వరుసగా ఆఫర్స్ వస్తున్నాయట. మరి, వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకొని చేతులు కాల్చుకుంటుందా లేక స్లో గా మంచి కథలను ఎంచుకొని కొన్నేళ్ళు ఇండస్ట్రీలో కొనసాగుతుందా చూడాలి.












