సినిమా

Dil Raju: సల్మాన్ ఖాన్ తో జాకీ ష్రాఫ్..ఈసారి సంథింగ్ స్పెషల్ రోల్

రచన: Anshu4 నిమిషాల పఠనం

Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆయనకి అత్యంత సన్నిహితుడు టాలెండ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలిసి హిందీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సౌత్ క్వీన్, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. నయన్ నటిస్తున్న రెండవ బాలీవుడ్ సినిమా. అది కూడా మేకర్స్ మన తెలుగు వాళ్ళు కావడం విశేషం.

అయితే, గత కొంతకాలంగా తెలుగులో అటు నిర్మాతగా, ఇటు డిస్ట్రిబ్యూటర్‌గా సరైన విజయాలను అందుకోలేదు దిల్ రాజు. భారీ నష్టాలను చూశాడు. ఇదే, సమయంలో టాలీవుడ్ లో నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్స్‌గా మైత్రీ మూవీ మేకర్స్, సితార, ఏషియన్ వారు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో, దిల్ రాజుకి ఇక్కడ పెద్ద హీరోలెవరూ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. మైత్రీ, సితార పెద్ద హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోల డేట్స్ ని లాక్ చేసుకున్నారు.

దాంతో, దిల్ రాజు పర భాషా నటులపై ఆధారపడాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే సల్మాన్ తో సినిమాను ప్లాన్ చేశాడు. తమిళంలో విజయ్ తో ఇలాగే వంశీ పైడిపల్లి తో చేసిన ద్విభాషా చిత్రం వారసుడు పరాజయాన్ని చూసింది. అయినా, ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద ప్రయోగం చేస్తున్నాడు దిల్ రాజు. భారీ కాన్వాయిస్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం, ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

అయితే, ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ జాయిన్ అయ్యాడు. సల్మాన్, జాకీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, నిన్నామొన్నటి వరకూ జాకీది ఇందులో నెగిటివ్ రోల్ అని ప్రచారం జరిగింది. కానీ, ఆయనది ఈ సినిమాలో బలమైన పాత్ర అని కథలో కీలకమైన భాగంలో వచ్చేదని క్లారిటీ వచ్చింది. విలన్స్‌గా అరవిందస్వామీ, రాహుల్ దేవ్, అభిమన్యు సింగ్ నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాను ఈద్ సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి, దిల్ రాజు హిందీలో హిట్ కొడతాడా లేదా చూడాలి.

#salmankhan#dilraju#vamshipaidipally#jackieshroff
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి