సినిమా

Bhagyashri Borse: ‘బ్లడీ రోమియో’ కి జంటగా ఛాన్స్ అందుకున్న భాగ్యశ్రీ

రచన: Anshu4 నిమిషాల పఠనం

Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజాయాన్ని చూసింది. కానీ, హీరోయిన్‌గా భాగ్యశ్రీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా, నాజూకు అందాలతో, నడుంపులతో ఇటు ప్రేక్షకులను, అటు ఫిల్మ్ మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది

Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజాయాన్ని చూసింది. కానీ, హీరోయిన్‌గా భాగ్యశ్రీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా, నాజూకు అందాలతో, నడుంపులతో ఇటు ప్రేక్షకులను, అటు ఫిల్మ్ మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది.

దాంతో, అమ్మడికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. కాంత, కింగ్‌డం, ఆంధ్రాకింగ్ తాలూకా..ఇవన్నీ భాగ్యశ్రీకి వచ్చిన వరుస ఆఫర్స్. కానీ, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గానే మిగిలాయి. ఆంధ్రాకింగ్ తాలూకా మరీ డిజాస్టర్ కాదు గానీ, ఆశించిన బిగ్ కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు. ఈ సినిమాల ఫలితం ఎలా ఉన్నా, భాగ్యశ్రీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

అదే సమయంలో ఊహించని అవకాశం తలుపుతట్టింది. అదే, అఖిల్ నటించిన లెనిన్ సినిమా. వాస్తవానికి, ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైంది. కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు. కానీ, ఇతర కమిట్‌మెంట్స్ వల్ల ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకోగా, ఆ అవకాశం భాగ్యశ్రీని వరించింది. ఇదే, తన కెరీర్‌లో మేజర్ టర్నింగ్ పాయింట్.

లెనిన్ పాన్ ఇండియాలోనే కాకుండా అమెరికా వంటి దేశాలలో కూడా మంచి కలెక్షన్స్‌ని రాబట్టింది. ఈ సక్సెస్‌తో ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలో నటించే సూపర్ ఛాన్స్ అందుకున్నట్టుగా తాజా సమాచారం. ఓజీ తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన దర్శకుడు సుజీత్, నాని హీరోగా ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురాబోతున్నాడు. ఇందులో మన నేచురల్ స్టార్ నానికి జంటగా ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. నిజంగా, ఈ ఆఫర్ గనక వస్తే.. ఇక భాగ్యశ్రీ కెరీర్ మంచి మలుపు తిరిగినట్టే. మరి, దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

#Nani#Sujeeth#BhagyashriBorse#BloodyRomeo
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి