సినిమా

Janhvi Kapoor-Sreeleela: ఇద్దరూ ఒకరినే ప్రేమిస్తే..అసలు మ్యాటర్ ఇదే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Janhvi Kapoor-Sreeleela: కొంతమంది మేకర్స్ చేసే సాహసాలు, తీసుకునే నిర్ణయాలు కొందరికీ బాగా కలిసి వచ్చి కెరీర్ మంచి మలుపు తిరుగుతుంది. శ్రుతి హాసన్ విషయంలో గబ్బర్ సింగ్ సినిమా ఛాన్స్ ఇచ్చి పవన్ చేసిన డేర్..ఆమెని ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా పాన్ ఇండియా లెవల్‌లో నిలుచోబెట్టింది. ఆరోజు పవన్ గనక ఒప్పుకోకుండా ఐరెన్ లెగ్ అని భావిస్తే ఆమె కెరీర్ ఇంకోలా ఉండేది.

అయితే, ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సౌత్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల విషయంలో బాలీవుడ్ మేకర్స్ ఇలాంటి సాహసమే చేయబోతున్నారు. ఫ్లాపుల్లో ఉన్న ఈ ఇద్దరితో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారు. హిందీలో స్టార్ మేకర్స్ అయిన ఏక్తా కపూర్, గునీత్ మోంగా కపూర్ ఈ సాహసానికి సిద్ధమవుతున్నారు. ‘పగలైట్’ మూవీతో దర్శకుడు ఉమేష్ బిష్త్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే జాన్వీ-శ్రీలీల నటించబోతున్నారట.

ఇదొక, క్రైమ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌ జానర్ లో రూపొందే సినిమా. ఇందులో, ఇద్దరు అమ్మాయిలు ఒకే కుర్రాడిపై చూపించే విపరీతమైన ప్రేమాభిమానాలు, అబ్సెషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఇందులో ఊహించని ట్విస్టులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి, కథలు కొత్తేమీ కాదు. కానీ, కథనం గనక ఆసక్తిరకంగా ఉంటే బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.

జానీ కపూర్ టాలీవుడ్‌లో దేవర, పెద్ది చిత్రాలతో లక్ ని పరీక్షించుకుంది. ఈ రెండు సినిమాలు ఇక్కడ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. ఇక, శ్రీలీల ఇక్కడ ఫ్లాప్స్ రావడం వల్ల బాలీవుడ్ లో లక్ పరీక్షించుకుంది. కానీ, అక్కడ అమ్మడి సినిమా ఏదీ రిలీజ్ కానేదు. ఇప్పుడు, ఈ ఫ్లాప్ హీరోయిన్స్ ఇద్దరూ బాలీవుడ్ లో ఒకేసారి, ఒకే సినిమాతో తన ఫ్యూచర్ ని టెస్ట్ చేసుకోబోతున్నారు. చూడాలి, మరి వీరి కెరీర్ ఎలా సాగనుందో.

#JanhviKapoor#Sreeleela#Ektakapoor#Bollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి