సినిమా

Pawan Kalyan: ఆగస్టు 15న OG వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ ..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే 300 కోట్ల హైయ్యెస్ట్ గ్రాసర్ కలెక్ట్ చేసిన సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ అండ్ మాఫియా బ్యాక్‌డ్రాప్ లో వచ్చి..పాన్ ఇండియా వైడ్ గా భారీ హిట్ సాధించింది. అసలు, ఈ సినిమా ఇంత సక్సెస్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. దీనికి, ముందు వచ్చిన హరిహర వీరమల్లు కమర్షియల్‌గా బిగ్ లాస్ అని ఒప్పుకోవాల్సిందే.

అలాంటి సమయంలో పెద్ద గ్యాప్ లేకుండా దర్శకుడు సుజీత్ ఓజీ చిత్రాన్ని రిలీజ్ చేశాడు. ఫస్ట్ షో నుంచి ఓజీ సునామీ మొదలైంది. సుజీత్ మేకింగ్, పవర్ స్టార్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ కి ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు దర్శకుడు, సంగీత దర్శకుడు అయితే ఎలా ఉంటుందో బ్లాస్టింగ్ అవుట్‌పుట్ ఓజీతో చూపించారు థమన్ అండ్ సుజీత్.

పవన్ కళ్యాణ్ ని ఇంప్రెస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది స్వయంగా ఆయనే ఓజీ సినిమా క్రెడిట్ మొత్తం సుజీత్ అండ్ థమన్ లది అని ఓపెన్ గా చెప్పడం గొప్ప విషయం. బాక్సాఫీస్ వద్ద సునామీ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలమైంది. ఆకలిమీద ఉన్న వారికి ఓజీ మంచి ఆహారం అయింది. ఇంకా, చాలారోజులు ఓజీ గురించి మాట్లాడుకుంటారు.

ఆ రేంజ్‌లో ఓజీ మూవీలోని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాంటి సినిమా శాటిలైట్ ప్రీమియర్ కి రెడీ అయిందంటే బుల్లితెర అభిమానులకి మళ్ళీ పండుగ వచ్చినట్టే. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఓజీ ప్రసారం కాబోతోంది. ప్రముఖ శాటిలైట్ ఛానల్ ఈటీవీలో పవన్ కళ్యాణ్ సినిమా టెలికాస్ట్ చేయనున్నారు. స్టార్ మా, జెమినీ, జీ ఛానల్స్ లో రావాల్సింది. కానీ, ఈసారి ఆ రైట్స్ ఈటీవీ వారు దక్కించుకున్నారు. మరి, స్మాల్ స్క్రీన్ మీద ఓజీ ప్రభంజనం ఎలా ఉంటుందో చూడాలి. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది.

#og#pawankalyan#sujeeth#ssthaman
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి